Home / General / తలరాతను రైలు ఎలా మార్చగలదు ? రైలు గుద్దినా ఆమె బతికే ఉంది.

తలరాతను రైలు ఎలా మార్చగలదు ? రైలు గుద్దినా ఆమె బతికే ఉంది.

Author:

రైలు గుద్దినాక బ్రతకటం ఏంటి అనుకుంటున్నారా? పట్టపగలు ముంబై లో నిజంగా జరిగిన సంఘటన ఇది. రాసి పెట్టి ఉంటే ఎంత పెద్ద యాక్సిడెంటు నుంచైనా గట్టెక్కుతాం అనే సామెతకు నిలువెత్తు ఉదాహరణ ఈ వార్త. ముంబయికి చెందిన పందొమ్మిదేళ్ల  ప్రతిక్ష నతేకర్ అనే యువతి కుర్లాలోని  రైల్వేస్టేషన్లో పట్టాల మీదినుండి ప్లాట్ ఫారం దాటేందుకు వెళ్తుండగా ఎదురుగా గూడ్స్ రైలోచ్చి గుద్దేసింది. ఆమె మీదుగా రెండు మూడు బోగీలు ప్రయాణించాయి కూడా. అయినా అమ్మాయి బతికే ఉంది.ఏవో చిన్న గాయాలు తప్ప పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. అంటే ఆమెకి అదృష్టమున్నట్టే కదా. అమ్మాయికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టే బతికి బట్ట గట్టింది అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.

Girl-run-over-by-Train-survives

అసలేం జరిగిందంటే.. ప్రతిక్ష తన ఫ్రెండ్ ని కలిసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు కుర్లా స్టేషన్ కి వచ్చింది. అప్పుడు సమయం దాదాపు ఉదయం 11 గంటలు. ఏడవ నంబర్ ప్లాట్ ఫారం నుంచి పక్క ప్లాట్ ఫారం మారేందుకు పట్టాలా మీదుగా నడుస్తోంది. అయితే చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతూ, పట్టాలు దాటుతున్న ఆమె ఎదురుగా గూడ్స్ రైలు రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని అస్సలు గమనించలేదు. పక్కన ప్లాట్ ఫారం మీద ఉన్న జనాలు అరుస్తూ కేకలు వేయడంతో అప్రమత్తమైన ఆమె ఒక్కసారిగా తేరుకుంది. కానీ ఎటు వెళ్ళాలో తెలియక అటూ ఇటూ పరిగెత్తేలోపే రైలోచ్చేసింది. అప్పటికే ఇది గమనించిన డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ.. ఆ రైలు ఆ అమ్మాయిని గుద్దేసి.. ఆమె మీదు గా కొంత దూరం వెళ్ళిపోయి ఆగింది. చూస్తున్న జనాలంతా హాహాకారాలు చేసారు. అయ్యో పాపం అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది అనుకుకున్నారు. అంతా చనిపోయిందనుకున్న ఆ అమ్మాయికి, ఎడమ కంటికి చిన్న గాయం తప్పించి ఏమీ కాకపోవటంతో ఈ యాక్సిడెంట్ ఒక అద్భుతంగా మారింది. ఇదంతా రైల్వే స్టేషన్ లోని సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది. వీడియో చూస్తున్నాం కాబట్టి నమ్ముతున్నారు కానీ అస్సలు నమ్మలేని ఈ నిజం ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. అయినా… బతికే ఉండాలన్న ఆమె తలరాతను ఈ గూడ్సు రైలు ఎలా మార్చగలదు ?

అమ్మాయి అదృష్టమే బాగుందో.. ఆయుశ్శే మిగిలుందో… కానీ, ఇంత పెద్ద ప్రమాదం నుంచి బతికి బయట పడడం మాత్రం నిజంగా అద్భుతం. నమ్మలేని ఈ నిజాన్ని నమ్మాలంటే ఈ కిందనున్న వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి. ఇక ముందు ఎప్పుడైనా పట్టాల మీదుగా దాటడం మానేయండి. చెవుల్లో హెడ్ ఫోన్స్ కూడా మానేయండి. ఒక రైలు పట్టాలపైనే కాదు, రోడ్డు పైన నడిచేటప్పుడు కూడా చాల జాగ్రత్తగా ఉండండి ముంచుకొచ్చే ప్రమాదాన్ని గమనించండి.

 

(Visited 3,242 times, 1 visits today)