Home / Inspiring Stories / కనుమరుగు కానున్న గ్రేట్ చైనా వాల్.

కనుమరుగు కానున్న గ్రేట్ చైనా వాల్.

Author:

the-great-wall-of-china-wallpaper

శతాబ్దాల కాలం గా చైనీయులకు రక్షణ గా నిలిచిన చైనా గోడ ఇక ఉందదా? అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎప్పుడో క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో నిర్మించిన “గ్రేట్ వాల్ ఆఫ్ చైనా” క్రమేపీ అంతరించిపోతోంది. ఇప్పటికే ఈ చైనా వాల్ 30 శాతం మేర కుదించుకుపోయినట్లు తాజాగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్పష్టం చేసింది. ఇందుకు ప్రకృతి ప్రళయాలతో పాటు మితిమీరిన మానవ తప్పిదాలు కూడా కారణమేనని అంటున్నారు. గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా అంటే అధునిక మానవుని ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి ప్రతిబింబం! మానవకట్టడాలలో దీన్ని మించినది లేదు. చంద్రునిపై నుంచి భూగ్రహం వైపు చూస్తే కనిపించే ఏకైక నిర్మాణం ఇదొక్కటే అని చెబుతారు.

కమ్యూనిస్టు చైనా ఏర్పడక పూర్వం రాజులు పరిపాలించిన కాలంలో మంగోలియా వంటి దేశాలు చైనాపై దాడి చేసేవి. అందు కోసం శత్రువులు తమ దేశంపై దాడి చేయకుండా ఉండేందుకు ఆత్మరక్షణకు తమ దేశ సరిహద్దుల్లో దుర్భేద్యమైన రాతి గోడను నిర్మించుకున్నారు.. ఈ చరిత్రాత్మకమైన కట్టడానికి వారసత్వ కట్టడంగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఉంది. పర్యాటకులు లక్షల్లో వస్తారు. కాని వారిలో ఎక్కువ మంది బీజింగ్‌ నుంచే వెళ్లి చూస్తారు. గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనాను ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ చూసిన వారు ఇప్పటివరకూ ఎవరూ లేరు.ఏనాడో క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో ప్రారంభమైన ఈ నిర్మాణం దశల వారీగా కొనసాగింది. దీని పొడవు 9000 కి.మీ.నుంచి 21 వేల కి.మీ. అని చెబుతారు. 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకూ మింగ్‌ డైనాస్టీ కాలంలో వేలకొద్దీ కి.మీ. పొడవున గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనాను నిర్మించారు.

గ్రేట్ వాల్ నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలను ఇళ్లు కట్టుకోడానికి చోరీ చేయడం వల్లే ఈ దుర్గతి దాపురించినట్లు తెలిపింది. దాదాపు 6,300 కిలోమీటర్ల పొడవున్న ఈ పురాతన చైనా వాల్ 1,962 కిలోమీటర్ల వరకూ కరిగిపోయిందని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆందోళన వ్యక్తం చేసింది. స్థానికులకు చైనా వాల్ ప్రాముఖ్యత పెద్దగా అర్థమైనట్టు లేదు దాంతో ఇటుకల కోసం గోడను పడగొడుతున్నారు.! మరి కొందరు అక్కడికి వచ్చే టూరిస్టులకు ఈ ఇటుకలను అమ్ముకుంటున్నారట. ప్రస్తుతం గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనాలో వినియోగంలో ఉన్న మార్గం ఎంతో, పోయింది ఎంతో తెలియడం కష్టం. కొన్ని చోట్ల బాగా పాడైపోయిందట. వర్షానికి తడిచి, ఎండకు ఎండిన ఈ చరిత్రాత్మక కట్టడాన్ని బీజింగ్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇన్ని శతాబ్దాలలో దాదాపు 2000 కి.మీ. పొడవునా పూర్తిగా నిరుపయోగంగా మారిపోయిందట. గోడ పొడవునా చాలా చోట్ల చిన్న చిన్న మొక్కలు మొలిచి గోడకు ఉపయోగించిన ఇటుకలు పాడైపోయాయట. అటువంటి గోడను నిర్మించడం అంటే మాటలు కాదు. చంద్రుని పైనుంచి కూడా కనిపించే ఈ గొప్పకట్టడం కొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే మాత్రం భూమ్మీదే కనిపించకుండా పోయే ప్రమాదముంది.

(Visited 3,031 times, 1 visits today)