Home / health / యోగా లందు మేక యోగా వేరయా!!!

యోగా లందు మేక యోగా వేరయా!!!

Author:

 

బం చిక బం చిక చెయ్యు బాగా ఒంటికి యోగా మంచిదేగా అని పాడుకుంటూ యోగా చేయడమే మనకు తెలుసు.. బాబా రామ్ దేవ్ యోగా కూడా బాగా పాపులర్ .. బట్ ఈ మేక యోగా ఏంటి? మేకల గోలేంటి అనుకుంటున్నారా? అదే మరి విడ్డూరం తో కూడిన విచిత్రం.

మనం పద్దతిగా యోగా చేస్తుంటే మేకలు మీదకు ఎక్కుతూ, మన వీపు పైన బ్యాలెన్స్ చేస్కుని నిల్చుంటాయిట. చూస్తుంటే మనుషులు యోగా చేస్తున్నారా లేక మనపైకి ఎక్కినా మేకలు యోగా చేస్తున్నాయా అనే డౌట్ వస్తుందా? ఎవరేమనుకున్నా, దీన్నే ‘మేక యోగా’ అంటారు. ఈ మేక యోగాని కనిపెట్టింది అమెరికాకు చెందినా లైనీ మోర్సీ అనే ఆవిడ. ఈవిడ పుణ్యమాని ఇప్పుడు అమెరికాలోనే కాదు, యూకే లో కూడా అంతా మేక యోగా జపమే చేస్తున్నారట.

goat yoga

ఈ మేక యోగా పాపులర్ అవడం తో డెవాన్ లోని పెన్నివెల్ ఫాం లో ఇప్పుడు ఈ మేక యోగా క్లాసులు ఫుల్ బిజీగా జరుగుతున్నాయి. ఈ యోగాకి ఎంత డిమాండ్ ఉందొ చెప్పాలంటే…రెండు గంటల క్లాసుకి 25 యూరోలు వసూలు చేస్తున్నారంటే అర్థం అవుతుంది. ఇక్కడి యోగా టీచర్ డోనా అసలు విరామం లేకుండా అందరికీ క్లాసులు చెబుతూ బిజీ అయిపోయారు. హతహ్ యోగాలో తర్ఫీదు పొందిన డోనా ఇప్పుడు మేక యోగా లో ఆరి తెరిపోయారు. మొత్తం మీద ఈ నయా యోగ వల్ల వీళ్ళ వ్యాపారం మూడొందల మేకలు.. ఆరొందల శిష్యులు గా మారింది. దగ్గరలోని మేకల ఫామ్స్ అన్నీ యోగా సెంటర్లుగా మారుతున్నాయి.

అయితే మన వీపు మీద మేకని ఎక్కించుకుని యోగా చేస్తే మనకు మానసిక ఉన్నతి, అలౌకిక స్థితి కలుగుతుంది అని యోగా ట్రైనర్ చెప్తుంటే మాత్రం జిహువకో రుచి..పుర్రెకో బుద్ది అనే సామెత గుర్తురాక తప్పదు. పైగా చేస్తున్నదే యోగా.. పైన మేక ఎక్కినా ఎక్కకపోయినా యోగా వాళ్ళ జరిగే మంచే జరుగుతుంది కదా.. ఇంకా మేక వాళ్ళ వచ్చే లాభమేంటి అనేది కామన్ మాన్ డౌట్.

అయితే, పశువులు, వాటి మీద పరిశోధనలు చేస్తున్న డాక్టర్ రోజర్ మాత్రం, ఈ మేకలే కాదు, ఏ జంతువు తోనైనా మనం కాసేపు గడిపితే వాటినుంచి వెలువడే ఆక్సిటోసిన్ అనే రసాయనం మనలో హార్ట్ బీట్ ని తగ్గించి, శారీరక మానసిక సమతుల్యతని అందిస్తాయని చెబుతున్నారు. చిన్న పిల్లల బోసి మొహం చూసినా, వారితో గడిపితే ఎలాంటి ఆనందం దొరుకుతుందో ఈ మేకలు, జంతువులతో కూడా అదే అనుభూతి లభిస్తుందని ఈ డాక్టర్ చెబుతున్నారు.

(Visited 125 times, 1 visits today)