Home / Inspiring Stories / గూగుల్ మ్యాప్స్ లో తొమ్మిదేళ్ళ తరవాత శవం గా దొరికాడు.

గూగుల్ మ్యాప్స్ లో తొమ్మిదేళ్ళ తరవాత శవం గా దొరికాడు.

Author:

sunken car shown in google maps

ఓ గూగుల్ మ్యాప్ తొమ్మిదేళ్ల మిస్సింగ్ మిస్టరీని ఛేదించింది. ఎవరికీ కనిపించకుండా పోయిన వ్యక్తి గూగుల్ కంటికి చిక్కాడు. అతనేమయ్యాడో అన్న విషయం తొమ్మిదేళ్ళుగా మిస్టరీగానే మిగిలిపోయింది. తొమ్మిదేళ్ల క్రితం మిచిగాన్ కి చెందిన 72 ఏళ్ల డేవిడ్ లీ నైల్స్  కారుతో సహా కనిపించకుండా పోయాడు. 2006 అక్టోబర్‌లో క్యాన్సర్ బాధితుడైన నైల్స్ ఒక మిత్రుడి ఇంటి నుండి బయలుదేరి ఎప్పటికీ తన ఇంటికి చేరలేదు. అప్పట్నుంచీ అతని కోసం ఎంతో వెతికారు. కానీ జాడ తెలియలేదు. క్యాన్సర్ వల్ల అతను డిప్రెషన్ లో ఆత్మ హత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా అతన్ని హత్య చేసి కారుని దొంగిలించారా? అన్నది కూడా అర్థం కాలేదు. అతని బందువులు కంఫార్మ్ చేసుకున్నదైతే మాత్రం నైల్స్ చనిపోయాడు అనే.

కానీ కనిపించకుండా పోయిన నైల్స్ నిజంగా నే చనిపోయాడు ఐతే అతన్ని ఎవరూ చంపలేదు, చనిపోయిందికూడా తన ఇంటికి దగ్గరలోనే. అయితే ఆ విశయం ఎలా తెలిసిందో తెలుసా? తొమ్మిదేళ్ల తరువాత గూగుల్ మ్యాప్స్‌లో ఆయన ఇంటికి దగ్గర్లో ఉన్న మిషిగన్ బైరాన్ టౌన్ షిప్‌లోని ప్రాంతాన్ని మిత్రుడొకరు చూస్తుంటే అందులో ఒక చెరువులో ఒక కారు జాడ కనిపించింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆ మునిగిపోయిన కారును బయటకి తీసి వెతికారు. అందులో ఒక ఓ వృద్ధుని శరీరం లభించింది.  కారు వివరాలని బట్టి చనిపోయింది నైల్స్ అని పోలీసులు నిర్దారించారు. ఎప్పుడో 2006 అక్టోబర్ 11న తప్పిపోయిన డేవీ లీ నైల్స్ మిచిగన్ బైరాన్ టౌన్ షిప్ లోని జేక్స్ బార్ అనే చెరువులో  శవమై దొరికాడు.

ఆ అస్థిపంజరం నైల్స్ దే అన్న విషయం దంతాల సాయంతో గుర్తించారు. గూగుల్ మ్యాప్స్ చిత్రంలో కారు పై భాగం స్పష్టంగా కనిపించింది. ఇలా తొమ్మిదేళ్ల తరువాత నైల్స్ అస్థిపంజరానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. అతని సమాధిపై ‘డేవిడ్ లీ నైల్స్ ఎప్పుడు ఎలా చనిపోయాడో తెలియదు’ అని ఆయన బంధువులు రాశారు. ఇలా గూగుల్ మ్యాప్స్ దొరకని ప్రదేశాలనే కాదు సాల్వ్ కాని కేసులలోనూ ఉపయోగపడుతూ క్రైమ్ డిటెక్షన్‌లోనూ పనిచేస్తోంది.

(Visited 4,404 times, 1 visits today)