Home / Entertainment / ఒక రోజు ముందే ‘సౌఖ్యం’గా మన ముందుకోస్తున్న గోపీంచంద్.

ఒక రోజు ముందే ‘సౌఖ్యం’గా మన ముందుకోస్తున్న గోపీంచంద్.

Author:

gopi chand sowkyam

టాలీవుడ్ లో సాహసం, లౌఖ్యం, జిల్…వరుస విజయాలతో ముందుకు సాగుతున్న హీరో గోపీచంద్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘సౌఖ్యం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో గోపీచంద్ కు ‘యజ్ఞం’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చి ఇంతకు ముందు పిల్ల నువ్వులేని జీవితం వంటి సుపర్ హిట్ ఇచ్చిన ఎఎస్ రవికుమార్ చౌదరి సౌఖ్యం సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ వారు నిర్మించారు. రెజీనా కసాండ్ర హీరోయిన్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఆడియో రిలీజ్ అయ్యింది.

ఆడియో కూడా సుపర్ హిట్ అవ్వడంతొ ఈ సినిమా పై భారీ అంచానాలు ఉన్నాయి అయితే ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు.అయితే, ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సౌఖ్యం సినిమా డిసెంబర్ 24వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా రిలీజ్ డేట్ ను ముందుకు జరపడానికి గల కారణాన్ని యూనిట్ ఇంకా వెల్లడించలేదు. ఏది ఏమైనా సినిమా లవర్స్ కు మాత్రం ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ గా మారింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి.

(Visited 43 times, 1 visits today)