Home / Inspiring Stories / గోవు మాత ఎలా అవుతుంది…అదో జంతువు మాత్రమే: కట్జూ

గోవు మాత ఎలా అవుతుంది…అదో జంతువు మాత్రమే: కట్జూ

Author:

గోవు ని తల్లిగా భావించనవసరం లేదట! గుర్రం, కుక్కల మాదిరి ఆవు కూడా ఒక జంతువేనట! ఆయన బీఫ్ నిరభ్యంతరంగా తింటారట! రాజకీయ నాయకులందరూ దొంగలు, దారిదోపిడీ గాళ్ళే నట! వారిని అర్జెంట్ గా ఉరి తీసేయాలట……ఇవన్నీ చెప్పినాయన సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ…..జంతువుల దగ్గర నుంచి రాజకీయనాయకుల వరకూ ఎవ్వరినీ వదలకుండా , అన్నేసి మాటలన్న ఆయన , మరి తాను మాత్రం విశుద్ధ వర్తనుడి కేటగిరీ లోకి వస్తారా ,,అంటే సమాధానం మాత్రం ఇవ్వరు. ఈ ప్రకటనలన్నీ ఆయన చేసింది వారణాసి పుణ్య క్షేత్రంలో…మీడియా ముంగిట! ఈయన గారి ప్రేలాపనలన్నీ వైరల్ గా నడవటంతో, కడుపు మండిన కొందరు విద్యార్ధులు ఆయన గారి దిష్టి బొమ్మని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ గేట్ ముందు తగలబెట్టారు కూడా!

ఇంత జరిగిన తర్వాత కూడా..కట్జూ గారి ప్రేలాపనల పర్వం ఆగలేదు. ఆవు అన్ని ఇతర జంతువుల మాదిరిదేనంటూ…..బీఫ్ తినటం తాను ఆపననీ, అలాగే ఇతరులను మాత్రం బీఫ్ తినండని మాత్రం చెప్పననీ మాత్రం కొంచెం స్వరం తగ్గించారు. అమెరికా, యూరోప్, ఆఫ్రికా , అరబ్ దేశాలలో, ఇంకా మన దేశంలో ని నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో బీఫ్ తినే అలవాటు ఉందనీ, అలా తినే వాళ్ళందరూ చెడ్డ వారైపోతారా అంటూ కట్జూ గారు లాజిక్ గా ప్రశ్నిస్తున్నారు. ఇహ, వెంటనే రాజకీయనాయకుల మీద విరుచుకు పడిపోయిన కట్జూ..వారిని బద్మాష్, నికమ్మా, నీచ్…అంటూ దుర్భాషలాడారు! వారిని ఉరి తీయాలంటూ డిమాండ్ చేసిన కట్జూ, ఇలాంటి వాళ్ళ కారణంగా , దేశం త్వరలోనే ఒక విప్లవాన్ని చూడాల్సి వస్తుందంటూ జోస్యం కూడా చెప్పారు.

మరో పక్క, గోవు మాంసాన్ని విదేశీ కంపెనీలు పిజ్జా , బర్జర్ లలో వాడుతున్నారనీ, ఆ కంపెనీల ఔవుట్ లెట్లు ఇండియా లో కూడా వాటి తయారీ లో గో మాంసాన్ని వినియోగిస్తున్నారంటూ ఇప్పటికే హిందూ సంస్థలు కొన్ని ఆందోళనలు లేవనెత్తాయి…….మరి కట్జూ గారి ఫార్ములా ప్రకారం….అవి కూడా తప్పు కాదేమో…..ఇష్టమొచ్చినట్టు పేలుతున్న కట్జూ ఒక వేళ …తన మీద ఎవరైనా దావా వేసినా స్వీకరించటానికి, ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడట! నేలకు పోయేది నెత్తికి రాసుకోవటం అలవాటుగా ఉన్న కట్జూ లాంటి వారి మాటల వల్ల, అనవసరంగా కొత్త ఆందోళనలు బయల్దేరే ప్రమాదమున్నట్టు కొందరు జుడీషియరీ పెద్దలే వాపోతున్నారు.

(Visited 143 times, 1 visits today)