నవమాసాలు మోసి, కని, పెంచిన బిడ్డ కనులముందే చనిపోతే ఆ ఆవేదన వర్ణనాతీతం. చెట్టంత కొడుకు నీడన తన జీవితాన్ని గడుపుదామనుకున్న ఒక తల్లి తను కన్నకలల్ని విధి కల్లలు చేసింది. అయినా తనకు వచ్చిన ఒక అద్భుతమైన ఆలొచనతో తన బిడ్డకి మరలా జన్మనిచ్చింది.
వివరాలలోకి వెళితే, పూణె నగరలొ నివసముంటున్న రాజశ్రీ పాటిల్ కొడుకు ప్రధమెష్ కాన్సర్ వ్యాధికి గురయ్యడు. తన బిడ్డ పడుతున్న బాధని చుసి తల్లి తల్లడిపోయేది. ఇప్పుడున్న ఆధునిక వైద్యం తన బిడ్డను కాపడలేకపొయాయి. తన బిడ్డ తనకు దక్కడు అన్న విషయన్ని జీర్ణించుకుంటునే తను ఒక నిస్చయానికి వచ్చింది. తన బిడ్డ బ్రతికుండగానే అతడి వీర్యాన్ని ఫెర్టిలిటి ప్రిజర్వేషన్ టెక్నాలజి(ఈవ్F) పద్దతి ద్వారా భద్రపరిచింది. ఆ వీర్యంతో తనే పిల్లల్ని కనాలనుకుంది. కాని తను మరలా పిల్లల్ని కనే ఆస్కారం లేకపోవడంతొ, సరోగసి పద్దతిద్వరా పిల్లల్ని కనొచ్చనే అలోచన వచ్చింది. తదనుగుణంగా ఒక మహిళకు తన పరిస్థితిని చెప్పి సరోగసి పద్దతికి ఒప్పించింది.
బిడ్డ 2016 ఫెబ్రవరి 28 న చనిపోగా, 2017 జూన్ లొ తను ఇద్దరు కవలపిల్లలకు జన్మ నిచ్చింది. ఇప్పుదు ఆ తల్లి ఆ ఇద్దరి పిల్లల్లొని తన చనిపొయిన బిడ్డని చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఇద్దరి పిల్లల్లొ ఒకరికి ప్రధమేష్ అని పేరుపెట్టి ఎంతో ప్రేమతో అల్లరుముద్దుగ చూసుకుంటుంది. ఇప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు.
తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,
ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.