Home / Entertainment / లిప్ లాక్ తో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ రేష్మి.

లిప్ లాక్ తో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ రేష్మి.

Author:

నందమూరి బాలకృష్ణ చేతులమీదగా గుంటూరు టాకీస్ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న సాయంత్రం 7:10 నిమిషాలకి విడుదల చేశారు. చందమామకథలు చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు ప్రవీణ్‌సత్తారు. విలక్షణ కథాంశాలకు సున్నితమైన భావోద్వేగాల్ని జోడించి సినిమాల్ని తెరకెక్కించే ఈ దర్శకుడు గుంటూరు టాకీస్ చిత్రాన్ని రూపొందించారు.జబర్దస్త్ షో కామెడీతో పాటు యాంకర్ రేష్మి చిట్టి పొట్టి డ్రెస్సులతో ఆ షోని మరింత హిటేక్కించింది.తాజాగా రేష్మి కూడా ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.హీరోయిన్ గా తన మొదటి చిత్రంలోనే రేష్మి రొమాంటిక్ సీన్స్ తో లిప్ లాక్ తో సినిమాకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రంలో శ్రద్దాదాస్ రాడికల్ పాత్రలో నటిస్తుండగా సిద్దు, నరేష్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు ఈ చిత్రాన్ని రొమాంటిక్ – కామెడీ చిత్రంగా రూపొందించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 25న పాటలను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.

(Visited 629 times, 1 visits today)