Home / Entertainment / బాహుబలి ఒక చెత్త సినిమా అలాంటి సినిమాకి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు..?

బాహుబలి ఒక చెత్త సినిమా అలాంటి సినిమాకి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు..?

Author:

Baahubali Award

దేశం మొత్తం బాహుబలి మానియా అంటుకుంది. అటు ఉత్తరప్రదేశ్ నుంచీ ఇటు రామేశ్వరం దాకా “బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడూ?” అంటూ విపరీతమైన టెన్షన్ తో ఊగిపోయారు. అనేక అవార్డులూ, జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపూ లభించాయి. అయితే అదే సమయంలో వచ్చిన విమర్శలూ లేకపోలేదు. అయితే వాటినెవరూ పట్టించుకోలేదు. కానీ మొన్న జాతీయ అవార్డు విషయంలో మాత్రం కొందరు కాస్త చాటుమాటుగా, మరికొందరు బాహాటంగానే “బాహుబలి” ఒక కమర్షియల్ సినిమానే తప్ప అందులో జాతీయ అవార్డు రావాల్సినంత విషయం ఏమీ లేదంటూ వ్యాఖ్యలు చేసారు. నిజానికి దర్శకుడు క్రిష్ చేసిన కంచె సినిమాకి ఈ అవార్డు వచ్చి ఉండవలసిందని చాలామంది అభిప్రాయం.

అయితే ఈ విషయంలో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరూ బయటకు మాట్లాడకపోయినా పంజాబ్ కు చెందిన డైరెక్టర్ గుర్విందర్ సింగ్ మాత్రం గట్టిగానే అడిగాడు. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే ఉన్న సినిమాకి అందులోనూ అసలు ముగింపు లేని ఒక పార్ట్ కు మాత్రమే అవార్డ్ ఎలా ఇస్తారు? అంటూ సూటిగానే అడిగేసాడు. అంతే కాదు ఈ చెత్త సినిమాకి అవార్డు ఇవ్వటాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అంటూ మరో బాంబు కూడా పేల్చాడు? ఈ గుర్విందర్ సింగ్ మామూలోడేం కాదు పంజాబీ సినిమాల్లో మన క్రిష్ అంతటి వాడు. ఆయన తీసిన సినిమా “చౌతీ కూట్” కూడా ఇదే సంవత్సరం ఉత్తమ పంజాబీ చిత్రంగా ఎంపికయ్యింది. నిజానికి గుర్వీందర్ చెప్పిన రెండు పాయింట్లు చాలు బాహుబలి జాతీయ అవార్డుకు ఎందుకు సరైంది కాదో… ఇక అభిమానులూ, దర్శకులూ ఈ విషయం మీద ఏమంటారో చూడాలి…

(Visited 1,524 times, 1 visits today)