Home / Inspiring Stories / హైదరాబాద్ లో మొదలైన హలీమ్ రుచులు.

హైదరాబాద్ లో మొదలైన హలీమ్ రుచులు.

Author:

ఈరోజు నుండి ముస్లీం ల పవిత్ర రంజాన్ మాసం మొదలు కానుంది. రంజాన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీమ్. హైదరాబాద్ లో ఎక్కడ చూసిన మనకు హలీమ్ బట్టీలు, హలీమ్ అమ్ముతూ, తింటూ రోడ్డు పై చాలా మంది కనిపిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ హలీమ్కు  మొఘలుల కాలం నుంచి ప్రత్యేకత ఉండబట్టే దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి నుండి హలీమ్ ను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.

haleem season started in hyderabad
ముస్లీంలు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో ఉండి, అనంతరం విరమించి హాలీం తింటారు. హలీమ్ శక్తినివ్వడంతోపాటు, ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్కప్పుడు హలీమ్ ముస్లీం వారు మాత్రమే తింటారు అనే నానుడి ఉండేది. కానీ, కొన్ని సంవత్సరాల నుండి హిందువులతో పాటు అన్ని మతాల వారు తింటున్నారు. జంట నగరాల్లో చార్మినార్‌, శాలిబండ, హిమాయత్‌నగర్‌, సైదాబాద్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో హలీమ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మటన్‌ హలీం, చికెన్‌ హలీం అమ్మకాలు ఎక్కువగా సాగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వెజిటబుల్‌ హలీమ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ లో భాగా ఫేమస్ పిస్తా హౌస్, సర్వికేఫ్, కేఫ్ 555. ఈ హొటల్స్ లలో హలీమ్ కు చాలా పేరు పొందింది. ఇక మీరు కూడా రెడీ గా ఉండండి హలీమ్ రుచులను టేస్ట్ చేయటానికి.

(Visited 697 times, 1 visits today)