Home / Entertainment / హ్యాపీ బర్త్ డే రీయల్ మ్యాన్ రజనీకాంత్.

హ్యాపీ బర్త్ డే రీయల్ మ్యాన్ రజనీకాంత్.

Author:

rajini kanth

రజనీకాంత్…దక్షన భారత సిని నటుడు ప్రేక్షక అభిమానులు ప్రేమగా సుపర్ స్టార్ గా పిలుచుకుంటారు. రజనికాంత్ పుట్టింది కర్ణాటక రాష్ట్రంలో మరియు పెరిగింది నచికుప్పమ్ గ్రామం, క్రిష్ణగిరి జిల్లా తమిళనాడు. జిజబాయి మరియు రామోజి రావు కి నాలుగొవ సంతానం రజినికాంత్, తండ్రి కానిస్టెబుల్ రజనికాంత్ తన తల్లిని ఎనిమిది సంవత్సరాల వయస్సు లోనె కోల్పోయాడు. రజినికాంత్ తన పాఠశాల చదువు అచార్య పాఠశాల భన్నారగట్టా, బెంగళూరు లో పూర్తిచేడు.రజనికాంత్ తన చిన్న వయస్సు లో చాలా కష్టాలు అనుభవించాడు ఎందుకంటే కుటుంబా ఆదాయం తక్కువ, తన మాతృ భాష మారటి.రజనికాంత్ సినిమాల్లోకి రాకముందు బెంగళూరు కొన్ని రకాల జాబ్స్ చేశాడు అలాగే స్టేజ్ నాటకాల్లో నటించాడు. తర్వత బెంగళూరులో బస్సు కండెక్టర్ జాబ్ చేశాడు సినిమాల్లొకి వచ్చేవరుకు.

అంతకు ముందు రజనికాంత్ 1973 లో మద్రస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో స్నేహితుల సహయంతో చేరాడు, అక్కడ ప్రభాకరణ్ ప్రోత్సక సహయం అందించారు. అక్కడ నుండి రజినికాంత్ వెనక్కి తిరిగి చూడలేదు సుమారు 190 సినిమాలు తమిళ్, తెలుగు, కన్నడ, మళయాలం, హింది భాషల లో పూర్తి చేశాడు. భాషా, ముత్తు, అరుణచలం, నరసింహ, రోబో, శివాజి, రజినికాంత్ కి మంచి పేరు  తెచ్చిపెట్టిన సినిమాలు.

సూపర్ స్టార్ గా ఒక ఊపు ఊపుతున్నప్పుడే. రీసెంట్ గా ఒక సారి ముతక పంచె, తెల్ల చొక్క తో ఒక దేవాలయనికి వెళ్ళిన రజని కారు ని గుడికి దూరంగా అపి అక్కడ నుంచి కాలి నడక వెళ్ళి దర్శనం చెసుకొని కారు దగ్గర వెళ్ళుతుండగా ఒక గుజరాతి మహిళ రజని చెతిలొ ఒక పది రూపయలు పెట్టిందంట. రజని ఎమి మాట్లడకుండా కారు దగ్గర కి వెళ్ళి ఎక్కపొతుంటె ఆ మహిళ నిజం తెలుసుకొని వచ్చి నన్ను క్షమించండి బీచ్చగాడిగా బావించాను. దయ చెసి 10 రూపయలు ఇచ్చివెయండి అని అన్నగానె… రజని బదులు గా నెను ఆ దెవుడి ముందు బీచ్చగాడిని, అందుకె ఆ దెవుడె మీ చెత బీక్ష వేయించాడు అని చెప్పి కారులొ వెళ్ళిపొయడంట. ఇది రజని జీవిత చరిత్రలో పొందుపరిచిన సంఘటన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటె ఇదెనెమొ.

రజనీకాంత్ భారతదేశం లోనే కాదు ప్రపంచ స్థాయి ప్రజాదరన ఉన్న సిని నటుడు అందుకు కారణం ఇతని నడక మరియు డైలాగ్ డెలివరి మాత్రమే కాదు. సామజిక స్పృహ ఎక్కువగా కలిగి ఉండటం అలాగే సామజిక,సాంఘిక సినిమాలను నిర్మించి జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్నారు.రజనికాంత్ చూడటానికి చాలా సామాన్యంగా ఉంటాడు,యెలా అతను సూపర్ స్టార్ అయ్యాడు అనిపిస్తుంది.బాగా ఆలోచిస్తే దాని రహస్యం తెలుస్తుంది.అతని కళ్లలోని చురుకుదనం,ముక్కు తీరు అందంగా ఉంటాయి.అతనికి అవన్నీ స్వతహాగ వచ్చినవే.తమిళంలో డైలాగ్ చెప్పే తీరులో తనదైన శైలిని యేర్పరుచుకున్నాడు. రజని చెప్పే మాటల్లో వినిపించే ఫిలోసఫి అతడి జీవితంలో నుంచి వచ్చిందే. ప్రతి సినిమాలో ఆ ముద్ర చూడవచ్చు.రజనికాంత్ నిజజీవితంలో కూడా చాలా విభిన్నమైన మనిషి. ఒకప్పుడు బస్ ఫిఎల్ద్ లో తనతో కలిసి పనిచేసిన మిత్రుల ఇంటికి మారు రూపాల్లో వెళ్లి వాళ్లని సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. వారి ఇంట్లో యేదైన కార్యక్రమాలు జరిగినప్పుడు గిప్ట్స్ పంపిస్తూంటాడు.

రజని హీరోగా ప్రస్తుతం నటిస్తున్న కబలి చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి మలేసియా వెళ్ళిన రజనీకాంత్ ని చూడడానికి భారీగా జనం గుమికుడారు.రజని సర్…అంటూ ఆయన్ను చుట్టుముట్టేస్తుండడంతో అందరూ షాక్ అయిపోతున్నారట. అంతేకాదు షూటింగ్ జరుగుతునన్ని రోజులు అక్కడి ప్రభుత్వం రజనికాంత్ కి ప్రాముఖ్యత ఇస్తూ వస్తుంది. స్వయంగా మలేషియా గవర్నర్….రజనీని ఇంటికి ఆహ్వానించి తెనేటి విందు ఇచ్చారు. ఇతర ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఆయనతో భేటి అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా అడుగడుగునా మలేషియాలో అభిమాన గణం రజని జపం చేస్తోంది.
ఇదే విషయాన్నీ ట్విట్టర్ లో రజని కూతురు సౌందర్య రజనీకాంత్ పోస్ట్ చేశారు. 1995 లో ఇండియా లో రజని, 2015 లో మలేసియా లో రజని అంటూ కూతురు తండ్రి గురించి చాల గొప్పగా పోస్ట్ చేసింది. ఎంతైనా రజనీకాంత్ ఫాలోయింగ్ అందరి హీరోలకు భిన్నంగా అలాగే జపాన్,మరియి చైన … చాలా దేశాలలో అభిమానులు ఉన్నారు.

రజనికాంత్ భారత అత్యన్నత అవార్డు పద్మ భుషన్ పొందాడు. రజినికాంత్ రచయితగా,నిర్మాతగా మరియు గాయకుడుగా తను నిరుపించుకున్నాడు..

(Visited 378 times, 1 visits today)