Home / Entertainment / తెలుగు సినిమా పై మాటల మార్కు వేసిన విక్రమార్కుడు.

తెలుగు సినిమా పై మాటల మార్కు వేసిన విక్రమార్కుడు.

Author:

Trivikram Srinivas Birth Day

యుద్ధంలొ గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం. ఔను యుద్దం చంపటానికి కాదు గెలవటానికి కేవలం గెలవటానికే కదా యుద్దం చేయాల్సింది. బహుశా త్రివిక్రమ్ ఇదే అనుకొని ఉంటాడు న్యూక్లియర్ ఫిజిక్స్ లో వచ్చిన బంగారు పతకాన్ని ఇంట్లో పడేసి సినిమా కోసం హైదరాబాద్ కి బయల్దేరినపుడే త్రివిక్రమ్ యుద్దం మొదలైంది….

భీమవరం సావసంగాడు సునీల్ తో కలిసి ఉన్న ఒక చిన్న గది,పోసాని దగ్గర అసిస్టెంట్ గా పని త్రివిక్రమ్ తన చదువిచ్చిన తెలివిని తప్ప ఆ సర్టిఫికెట్ ని వాడుకోలేదు బహుశా దాన్నెలా వాడుకోవాలో పెద్ద క్లారిటీ లేదు అంతే.. దేవుడందరికీ అన్నీ ఇవ్వడు దేన్ని ఎంచుకోవాలో అవకాశాలు మాత్రం ఇస్తాడు ఏది కావాలో ఎంచుకొమ్మంటాడు.. ఆ ఆఫర్ లో త్రివిక్రమ్ జాబ్ ని కాక ఫ్రొఫెషన్ ని ఎన్నుకున్నాడు.అద్బుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు అద్బుతం జరిగిపోయాక గుర్తించాల్సిన అవసరం ఉండదు. నలుగురు కుర్రాలు ఒక చోట చేరి ఏవో సినిమా కబుర్లు చెప్పుకున్నప్పుడు అందులో తప్పకుండా వినిపించే డైలాగ్స్, పంచ్ లు కామెడి సెటైర్లు దాదాపుగా త్రివిక్రమ్ వే అయుంటాయి.

అద్బుతమైన మాటలు తాత్వికుడు గా కనిపిస్తూనే ట్రెండీ గా కామెడీ గా కూడా రాయగలడు.ఇన్ని రాసే త్రివిక్రమ్ బయట మాట్లాడలేడు.ఏఫంక్షన్ కి వచ్చిన మాటలకంటే ఎక్కువ నవ్వుతూనే ఉంటాడు ఈ మాటల మాంత్రీకుడి డైలాగ్స్ లో కొన్ని జీవిత సత్యాలనిపించేలా ఉంటే మరికొన్ని హాయిగా నవ్వుకునేలా ఉంటాయ్..

తన మాటలతో తెలుగు సినిమాల స్థాయిని పెంచిన మన మాటలు మాంత్రికుడు మరెన్నో సినిమాలని చేయాలనీ కోరుకుంటూ అలజడి.కాం తరుపున జన్మదిన శుభాకాంక్షలు.

(Visited 324 times, 1 visits today)