Home / Entertainment / వెండి తెరని ఊపేసిన దర్శకుడు…!

వెండి తెరని ఊపేసిన దర్శకుడు…!

Author:

వినాయక్ ఈ పేరు వింటేనే తెలుగు సినిమా తెర ఆవేశంగా తెరుచుకుంటుంది. నిశ్శబ్దంగా ఉన్న దారిలో హటాత్తుగా రెండు బాంబులు పేలి ఆ దుమ్ములోనుంచి దూకుతాయి రెండు సుమోలు. సుమోలకీ ప్రేక్షకుడికీ మద్య ప్రత్యక్షమౌతాడు హీరో. చేతిలో ఆయుధం ఉండదు వయసు 25 కి మించదు కానీ అతని చూపుకి కొమ్ములు తిరిగిన వస్తాదైనా ఒక్కడుగు వెనక్కేయాల్సిందే… దెబ్బ కొట్టాడా 70 కేజీ ల మనిషైనా ఎగిరి  అల్లంత దూరం లో  పడాల్సిందే. ఒక్క సారి ప్రేక్షకుడి లోనూ ఆవేశం పెరుగుతుంది. నరనరాల్లొనూ తానూ అన్యాయాన్ని ఎదుర్కోవాలన్న కోరిక రగులుతుంది. తను చేయలేని పని హీరో చేసేస్తూంటే ప్రేక్షకుడు ఆనంద పడతాడు వినాయక్ తెర వెనక నిలబడి ప్రేక్షకున్నే చూస్తూంటాడు…

ఇది వరకు తెలుగు సినిమా మామూలుగానే ఉండేది, ఏదైనా కాస్త మసాలా కావాలనుకుంటే రెండు కత్తులని వాడి కొద్దిగా రంగు నీళ్ళు వాడే వాళ్ళు దర్శకులు, 2002 “ఆది” ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సినిమా ఓక యువ హీరోకి కావల్సినంత హీరొయిజం అతని స్టామినాకి సరిపోయేంత ఎమోషన్ ఉన్న కథ హీరో గా యంగ్ హీరో,ఇన్నాళ్ళూ అలాంటి కథ అంటే బాలయ్య బాబు మాత్రమే కళ్ళలో మెదిలేవారు,కానీ
ఇప్పుడున్నది జూనియర్ ఎంటీఆర్ అప్పటికి ఇంకా క్యూట్ లుక్ తోనే ఉన్నడు.. ఆ క్యూట్ నెస్స్ పోకూదదు కానీ ఎమొషన్ కి విలన్ వణికి పోవాలి ప్రేక్షకుడికి అర్థరాత్రి స్మశానం దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం చూసినంత ధైర్యం కలగాలి…. ఎలా..? అనుకోలేదు వినాయక్ తను చేయించాడు ఒక్క దెబ్బ తొడ మీద పడగానే “దన్” మన్న శబ్దం తో థియేటర్ దద్దరిల్లింది….. ప్రేక్షకుడి నోట్లోంచి అంతకు మించిన సౌండ్ తో విజిల్ మోగింది….. అదే థియేటర్ లొ చివరి వరుసలో కూర్చున వినాయక్ అనుకున్నాడు… “అమ్మ తోడు ఇక ఆటాడిస్తా” అని,

దిల్ మరీ యంగ్ లుక్ తో ఉన్న హీరో కానీ ఎక్కడా తగ్గ కూడదు సుమోలూ, బాంబులూ లేవు వినాయక్ కి టెన్షన్ కూదా లేదు. ఎందుకంటే తనేం చేయబోతున్నాడో తనకి తెలుసు. నితిన్ బైక్ సైలెన్సర్ లాగాడు, ఫైట్ ల దగ్గరా, విలన్ ని ఎదుర్కునేందుకూ మైండ్ గేం ఆడాడు. కాదు వినాయక్ ఆడించాడు.. దిల్లున్న డైరెక్టర్ తీసుకున్న రిస్క్ వర్క్ ఔటైంది వినాయక్ ఫార్ములా ఒక దుమారం రేపింది…

మూడో సినిమా నే మెగాస్టార్ తో తమిళ సినిమా “రమణ” కి అనువాదం. తగిన మార్పులు చేసుకున్నాడు కానీ తాను హ్యాండిల్ చేయబోయేది వన్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ తెలుగు సినిమా. ఒక్కొక్క సీనే చెప్తున్నాడు. అతను నరేట్ చేసే విధానం చిరుని ఆకట్టుకుంది నటన అంటే అతనీ మీద, తాను తీయబోయే సీన్ మీద పక్కా పట్టున్న మనిషి చిరుకి నచ్చాడు. ఒక సీన్ లో నటించాడు కూడా…. అవీ నీతి పరుడైన తండ్రి దేశాన్ని దోచుకునే చీడ పురుగుల్లో ఒకడని తెలిసి తన తండ్రా,దేశమా అనుకున్న పరిస్థితుల్లో కన్న తండ్రినే చంపేయమని చెప్పాలి…. ఆ ఒక్క సీన్ చాలు వినాయక్ కి నటన మీదున్న గ్రిప్ ఏమిటో తెలియటానికి…ఠాగూర్ హిట్ వినాయక్ స్టార్ డైరెక్టర్…

ఆ తర్వాత వరుసగా.. తన తొలి హీరో, మంచి మిత్రుడు అయిన తారక్ తో “సాంబ” ,అల్లరి పిల్లవాడి కథ బన్నీ, విక్టరీ వెంకటేష్ తో లక్ష్మి, యంగ్ రెబెల్ స్టార్ తో యోగీ కొద్ది గా డల్.. మల్లీ వెంటనే సర్దుకున్నాడు ,మాస్ మహారాజా రవితేజా తో కృష్ణ,ఇంకో సారి తారక్ తోనే అదుర్స్ అదుర్స్…. ఒక్క ఫ్లాప్ కూడా లేదు…

కొన్నళ్ల గ్యాప్ తర్వాత వినాయక్ కొద్దిగా తడబడ్డాడు బద్రీ నాథ్ మళ్ళీ నిరాశ పరిచింది… కొన్నాళ్ల క్రితం అళ్ళుడు శ్రీను సినిమా అన్నదే ఒక బొమ్మా బొరుసూ లాంటిది ఒక సినిమా పూర్తయ్యే లోపు ప్రేక్షకుడి అభిరుచి మారిపోతూంటుంది… కొన్ని ఎగుడూ దిగుళ్ళు తప్పవు అందుకే కొద్దిగా సైలెంటయ్యాడు…

ఐతే మనోడు పులి టైపు ఒక్కడుగు వెనక్కేస్తే ఓడిపోయినట్టు కాదు. మరోసారి పంజా విసిరేందుకు.చిరంజీవి 150 వ సినిమా ఒక కీలకమైన మలుపు,అద్బుతమైన విజయం కావాలి దర్శకుడుగా వినాయక్ కి…,నటుడుగా చిరు కి కూడా… చిరు కి వినాయక్ మీద నమ్మకం ఉంది వినాయక్ సినిమాని ఖచ్చితంగా టాప్ హిట్ చేస్తాడని వినాయక్కీ వినాయక్ మీదే నమ్మకం ఉంది తాను చిర ని నిరాశ పడనివ్వను అని… పేక్షకుడికీ నమ్మకం ఉంది ఈ ఇద్దరూ కలిసి మరో తుఫాన్ సృష్టిస్తారని….

ఇవాళ వినాయక్ బర్త్ డే ఈ సందర్బంగా వినాయక్ కి శుభాకాంక్షలు చెబుతోంది అలజడి టీం.

(Visited 106 times, 1 visits today)