Home / Political / మిషన్ తెలంగాణాకు 62 ఏళ్ళు.

మిషన్ తెలంగాణాకు 62 ఏళ్ళు.

Author:

KCR

అరవయ్యేళ్ళుగా కోట్లాది మంది కంటున్న ఒకే కల అతని కళ్ళలోనూ కన్నాడు. ఒక్కడే అందరి నాలుకా అయ్యాడు… మొదలవటం చతికిలబడటం దగ్గరే ఆగిపోయిన ప్రత్యేక తెలంగాణా ఉధ్యమాన్ని విజయం చివరి వరకూ నడిపించిన ధీరుడు. ప్రత్యేక తెలంగాణా ఆకాంక్ష, కేసీఆర్ ఇద్దరిదీ దాదాపు ఒకే వయస్సు, అందుకే ఎవరొప్పుకున్నా ఒప్పుకోకునా ఇప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణా..తెలంగాణా అంటే కేసీఆర్…

ఇడ్లీసాంబార్ గోబ్యాక్‌ నుంచి జై తెలంగాణా ఉధ్యమం దాకా మనం మనం ఒకటే అంటూనే సాగిన దోపిడీ వర్గాల నుంచి తెలంగాణాను తప్పించిన ఈ యోధుడు ఇప్పుడు 62 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఈ రోజుతో (2016ఫిబ్రవరి 17) కేసీఆర్ 63 సంవత్సరం లోకి అడుగు పెట్టారు. తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న కేసీఆర్‌ కు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గవర్నర్ ఆకాంక్షించారు. అలాగే మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, జుపల్లి కృష్ణారావు, సీఎస్‌ రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఎమ్మెల్యేలు రవీందర్‌ రెడ్డి, బాలారాజు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తదితరులు కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

“నేను తెలంగాణ యువకులకు, తెలంగాణ విద్యార్థులకు దండం పెట్టి చెప్తున్న., మీ కడుపుల తల్కాయ పెట్టి చెప్తున్న.. మీరు మిమ్ములను మీరు కాల్చుకోని చచ్చిపోతె.. మేంగూడ ఇక్కడ సగం కాలిచచ్చిపోతం.., కూలిపోతం.., మానసికంగ దెబ్బతింటం…. కాబట్టి దయచేసి ఎవ్వరుగూడ భయపడొద్దు. కచ్చితంగా తెలంగాణ వచ్చే కోసం వచ్చేవరకు మనం పోరాటం చేద్దాం. ఎనుకకు పోయె సమస్యే లేదు. మడమ తిప్పే ముచ్చటే లేదు. ఎవ్వరుగూడ దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇగ తప్పదనుకుంటె గిట్ట నేనే దీక్షకుపోత.. ఉంటె ఉంటా పోతెపోత. ఇగ ఎందాకైతె అందాక!” అన్న ఆయన ప్రసంగం లోని మాటలు ఇప్పటికీ ఒక ఉధ్యమ నేత ఎలా ఉండాలో చెబుతూనే ఉంటాయి….

ఈ రాష్ట్రాన్ని విముక్తం చేసే ఉధ్యమాన్ని నడిపించిన వ్యూహకర్తగా,తె లంగాణా రాజకీయ నిర్దేశకుడిగా ఆయన ఇలా మరెన్నొ పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ… తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు….

(Visited 127 times, 1 visits today)