Home / Inspiring Stories / హ్యాపీ మెన్స్ డే..!

హ్యాపీ మెన్స్ డే..!

Author:

Happy Men's Day

ఐ పిటీ ఆన్ యూ మిస్టర్..! ఎన్ని రోజులుగా వివక్షకు గురయ్యావు నువ్వు నాన్నగా, అన్నగా,స్నేహితుడుగా.. రేయ్ మగాడా..! నువ్వొక అన్సాట్చురేటేడ్ లవణానివి తనివి తీరా ఏడవటానికి కూడా స్వేచ్చలేని బానిసవి.
ఓయ్…! ఆదామూ గుర్తుందా ఒకనాడు అవ్వని సంతృప్తి పరచాటానికే కదూ నువ్వు దేవున్నే ధిక్కరించావు.నిషిద్దాఙ్ఞల కంచెలని బద్దలు కొట్టి దేవుడికన్నా నాకు స్త్రీ ముఖ్యం అని నిలబడ్డావు. అద్గదో అప్పుడే కదా నువ్వు సమస్త విశ్వము సాక్షిగా ఆయొక్క స్త్రీ బానిసనని సగర్వంగా ప్రకటించుకున్నావు…
ఎక్కడెక్కడి రోదనలని మోస్తూనే ఆమె కోసం నువ్వొక శిరచ్చేద శరీరానివై వెంపర్లాడుతూ ఒక యుగారంభకాలాననే నువ్వామే పాద స్పర్శతో పులకించినాడవు…
మై డియర్ ఫాదర్..! డొక్కు సైకిలెక్కి నువ్వు తొక్కిన జీవితం.., అన్నా..! పాదమ్మీద పుట్టుమచ్చలా నువ్వు ఇచ్చిన భరోసా. తమ్ముడూ..! నువ్వు చేసిన కొన్ని న్నవ్వుల త్యాగము వెరసి మగాడి జీవితాన మృగాడన్న మచ్చతో తుడిచి పెట్టుకు పోయినప్పుడు నాకు తెలుసురా.. ఎన్ని కన్నీళ్ళెన్ని ఉక్రోషాలెన్ని నిర్దోష ప్రకటనలని నీ గుండెలో అదుముకున్నావో… అయినా మై డియర్ ఫూల్ నువ్వొక మేల్ నువ్వు నిన్ను నిర్దోషిగా నిలబెట్టుకునే అర్హతని కోల్పోయావ్.
అర్థ రాత్రి ఉలిక్కి పడి నిద్ర లేచిన బిడ్దని గుండెలపై వేసుకొని అమ్మ స్పర్శని అనుభూతించిన నాన్న,తోడబుట్టిన దాని కన్నీటి చుక్క నోట్బుక్ మీద చూసి తెల్లరే బస్టాప్ లో స్వజాతి పుండుని చితకొట్టుకొని రక్తం తో నిలబడ్డ సోదరా..! “తన” కోసం తనలా నిలబడ్డ స్నేహితుడా “ఆమె” సహచరుడా… ఇదో..! నీ కూ ఓరోజుందట.. హ్యాపీ మెన్స్ డే యార్.

(Visited 111 times, 1 visits today)