Home / Inspiring Stories / ట్రాఫిక్ రూల్స్ పాటించని రాజకీయ నాయకుడికి చుక్కలు చూపించిన కానిస్టేబుల్.

ట్రాఫిక్ రూల్స్ పాటించని రాజకీయ నాయకుడికి చుక్కలు చూపించిన కానిస్టేబుల్.

Author:

“నువ్వు నాయకుడైతే ఎంటీ ఎవరైతే ఏమిటి? నువ్వు చట్టాన్ని దిక్కరించావ్… ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ నే ఎదిరించ బోయావ్.. చెప్పకు నువ్వు సారీ చెప్పినంత మాత్రాన ఊర్కునేది లేదు, నీ జులుం ఉంటే నీ దగ్గర చూపించుకో ఇది డిల్లీ ఇక్కడ నీ ఆటలు సాగవు.. నేనొక పోలీస్ ని” ఇదేం కొత్త సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ కాదు. డిల్లి రోడ్డు మీద నెంబర్ ప్లేట్ లేకుండా వచ్చిన రాజకీయ నాయ కున్ని దులిపేసిన రియల్ హీరో అన్న మాటలు…

చట్టం ఎవడి ముందూ సలాం కొప్ట్టదు..ఎవరైనా ఒకటే ఇదే నియమం ఎవరికైనా వర్తిస్తుంది అన్న విశయాన్ని ఒక రాజకీయ నాయకుడికి అర్థమయ్యేలా చెప్పాడీ పోలీస్ కానిస్టేబుల్. వాహనంపై నెంబర్ ప్లేట్ లేకపోయినా, ఉన్న నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకున్నా, ఫ్యాన్సీ మోడల్‌గా నెంబర్ ప్లేట్‌ను మార్చుకున్నా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించినట్టే అవుతుంది. అది మన దగ్గరే కాదు. దేశంలో ఎక్కడైనా అంతే. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఈ రూల్స్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ నాయకుడు ఒకరు వాహనం నంబర్ ప్లేట్‌పై నంబర్‌కు బదులుగా తమ పార్టీ లోగోను వేసుకున్నాడు. అదే వాహనం తో డిల్లి రోడ్లమీద పరుగులు తీయించాడు. అయితే ఆ వాహనాన్ని ఆపిన ఒక కానిస్టేబుల్ నంబర్ ప్లేట్ లేదేమిటని ప్రశించ గానే తన తరహా రాజకీయ జులుం చూపించ బోయాడు. అంతే ఇక మనోడికి తిక్క రేగింది.

నీ దమ్మంతా హర్యానాలో చూపించుకో ఇది డిల్లీ ఇక్కడ నీ వేశాలు నడవవు. అంటూ చడా మడా దులిపేసాడు. దాంతో కాళ్ళ బేరానికి వచ్చిన ఆ నాయకుడు సారీ..సారీ అంటూ కాళ్ళ బేరానికి వచ్చినా వినిపించుకోలేదు. నాయకుడైతే రూల్స్ ఉండవా? అసలు ఇదా పద్దతి.. అంటూ పోలీస్ అంటే ఏమిటో చూపిస్తూ తన కెమెరాలో రికార్డ్ చేసాడు… ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో విపరీత ప్రాచుర్యం పొందింది. ఈ వీడియోని షేర్ చేస్తూ ఆ పేరు తెలియని కానిస్టేబుల్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు…

(Visited 1,016 times, 1 visits today)