Home / Entertainment / యాసిడ్ దాడికి వ్యతిరేకంగా ఒక అందమైన ప్రేమ కథ.

యాసిడ్ దాడికి వ్యతిరేకంగా ఒక అందమైన ప్రేమ కథ.

Author:

Ishq Short Film

ప్రేమ కోసం ఒక అమ్మాయి వెంట పడతాడో అబ్బాయి. ఆమెకి ఇష్టం లేదు అదే విషయాన్ని చెప్పేస్తుంది అయినా వినకపోతే మొహం పగలగొడుతుంది. ఆ రెండో రోజే ఆమె మొహం యాసిడ్ తో కాలిపోతుంది జీవితాంతం అనుభవించాల్సిన నరకాన్ని బహుమతిగా ఇస్తాడా ప్రేమికుడు, లేదంటే ఏకత్తి తోనో ఆమె శరీరాన్ని చిద్రం చేస్తాడు ప్రేమకు బదులు ఆమె రక్తాన్ని రుచి చూస్తాడు….. అతనితో పాటు ప్రేమ “సహాయానికి” వచ్చిన అతని స్నేహితుడూ కటకటాల్లోకి వెళ్తాడు. ఎన్నో పేపర్లలో చదివిన కథే ఇది.. ఇంకెన్నోసార్లు టీవీల్లో చూసిన వార్తే ఇది. ఇక ఎప్పటికి మారతారు వీళ్ళు? అనుకున్నాం కదా..!

అదే మార్పు మొదలైనట్టే ఉంది. నిజానికి ప్రేమనేది మనసులో బలంగా ఉంటే ఆ అమ్మాయి తో ఎన్ని దెబ్బలైనా తినగలడు,తన ప్రేమ నిజమైందైతే ఆమె వద్దన్నా ఆమె బాదపడటం భరించలేడు. తన స్నేహితుని మీదా,తన అక్కా చెల్లెల్ల మీదా ఇష్టం ఉన్న వాడు ఎప్పటికీ ఒకమ్మాయి యాసిడ్ దాడిలో మొహం కాలిపోవటాన్ని చూడలేడు…. తన స్నేహితుని భవిశ్యత్తుని నాశనం కానివ్వడు. ఇదే కాన్సెప్ట్ తో కిషోర్ కూమార్ అనే యువ దర్శకుడు తనే కత రాసుకొని తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఆన్ లైన్ లో పిచ్చి పాపులర్ అయిపోయింది.. “ఇష్క్” పేరుతో హిందీ లో వచ్చిన ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు యూత్ అందరికీ విపరీతంగా నచ్చేసింది..

(Visited 542 times, 1 visits today)