బొప్పాయి (పొప్పడి) పండు తినడం వలన ఆరోగ్యంతో పాటు అందం కూడా రెట్టింపు అవుతుంది అంటున్నారు. ఒకప్పుడు ఊళ్ళల్లో ఎక్కువగా కనిపించిన బొప్పాయి ఇప్పుడు తోటలుగా పెంచుతున్నారు అంటే వీటి వలన ఎంత లాభం పొందుతున్నారో తెలుస్తుంది. ఈ బొప్పాయిలో చాలా పోషకాలు ఉండటం వలన దీనిని ఎక్కువగా తింటున్నారు. బొప్పాయిలో ఎక్కువగా విటమిన్ ఏ, బీ, సీ,డీ లు సమృద్ధిగా ఉంటాయి.ఈ పండులో ‘పెప్సిన్’ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. ఉదర సంబంధించిన జబ్బులకు బొప్పాయి చాలా ఉపయోగపడుతుంది.

బొప్పాయి వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు:
- ఈ పండు తినడం వలన కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా బిటాకెరోటిన్ తోడ్పడుతుంది.
- ఈ పండులో లభించే విటమిన్ ‘సి’ వలన రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి, దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
- బొప్పాయిలో విటమిన్ ‘బి’ వలన పెదాల పగుళ్లు,తెల్లమచ్చలు, నోటి పూతలు రాకుండా చేస్తుంది.
- ఈ పండు తినడం వలన తామరను నివారిస్తుంది.
- ఈ కాయను పచ్చిగా తినడం వలన హై బీపీ(అధిక రక్తపోటుని) నియంత్రిస్తుంది.
- ఇందులోని బీటా కెరోటిన్,ల్యూటీన్, క్సాంతిన్, సిప్రోటాక్సింతిన్… క్యాన్సర్‌నీ రాకుండా చేస్తాయి..
- బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచటానికి, ఆస్తమా, కీళ్లవ్యాధులను రాకుండా చేస్తుంది.
- గాయాల్ని,ఎలర్జీల్నిచాలా వరకు తగ్గిస్తుంది.
- ఈ పండు తినడం వలన చర్మం కాతివంతంగా అవుతుంది.
- ఈ పండు వలన మగవారికి ‘స్పెర్మ్ క్వాలిటీ’ పెరుగుతుంది.
- నెలసరి సమయంలో బొప్పాయి ఆకులు నొప్పిని నివారిస్తాయి.
బొప్పాయి వలన అందానికి కలిగే ఉపయోగాలు:
- బొప్పాయి పండును కొన్ని ముక్కలుగా కోసి కొద్దిగా మెత్తగా చేసి దానికి చెంచా తేనె కలపాలి.ఇలా చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తరవాత కడిగేసుకోవాలి అంటే ముఖం కాంతివంగా అవుతుంది..
- ఎండలో తిరిగి ముఖం నల్లగా మారినప్పుడు నానబెట్టిన బాదంతో కొన్ని బొప్పాయి ముక్కలను కలిపి దానిని ముఖానికి పట్టిస్తే 5 నిముషాలలో మన మునుపటి కాంతి వస్తుంది.
- ఒక చెంచా నారింజ రసం, కొన్ని బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి మృదువుగా రాయాలి. ఇలా చేయడం వలన నల్ల మచ్చలు తొలగిపోతాయి.
- ఎంతో ఖర్చు చేసి వాడే ఫేస్ క్రీములకన్నా బొప్పాయి ఎంతో మిన్న.
(Visited 1,266 times, 1 visits today)