Home / health / జామకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసుకోండి.

జామకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసుకోండి.

Author:

ఈ సీజన్స్ లలో ఎక్కువగా మనకు దొరికే పండ్లలో జామకాయ ఒకటి. పెరటిలో ఉన్న దాని నుండి వచ్చే పండ్ల పైన అంతగా దృష్టి పెట్టలేరు.మనలో చాలా మంది ఏదైతే చవకగా దొరుకుందో దానిని పట్టించుకోరు, ఏదైతే చాలా ఖరీదైంది ఉంటుందో దాని వెంట పడుతుంటారు. కానీ చవకగా దొరికే దానిలో విలువైనవి ఉంటే ….. అబ్బా దీనిని అనవసరంగా ఇన్ని రోజులు మిస్ అయ్యాము అనుకుంటారు. అలాంటి వాటిలో మన పెరటిలో పండే పండ్లలలో మొదటిగా ఉండేది జామపండు ఒకటి. దీనిలో ఉండే పోషాకాలు మనకు మరి ఏ ఇతర పండ్లు ఇవ్వదు అని చెప్పవచ్చు.

guvaua-health-benefits

జామపండు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం:

  • జామపండులో ఏ,బి,సి, విటమిన్స్ అధికంగా ఉంటాయి.
  • ఈ పండులో పోషకాలు, పీచు ఎక్కువ గా ఉండి, కొవ్వు తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారు జామపండు తింటే చాలా మంచింది.
  • జామపండు తినడం వలన మలబద్దకం చాలా వరకు తగ్గుతుంది.
  • షుగర్ ఉన్నవారికి జామపండు చాలా మంచింది.
  • కమల పండులో దొరికే విటమిన్ సి కన్నా జామపండులో 5 రేట్లు అధికంగా లభిస్తుంది.
  • ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా ఉత్తమం అంటారు కధ!. ఆకు కూరల్లో దొరికే పీచు కంటే జామలో రెండు రేట్లు ఎక్కువగా దొరుకుంది.
  • ఆపిల్ లో ఉండే పిచ్ కంటే జామలో అధికంగా ఉంటుంది.
  • పది ఆపిల్స్ లలో ఉండే పోషకాలు ఒక్క జామకాయలోనే ఉంటాయి.
(Visited 4,287 times, 1 visits today)