Home / Latest Alajadi / సకల రోగాల నివారిణి అయిన నేరేడుపండులో ఉండే పోషకాల గురుంచి తెలుసుకోండి.

సకల రోగాల నివారిణి అయిన నేరేడుపండులో ఉండే పోషకాల గురుంచి తెలుసుకోండి.

Author:

నేరేడు పండ్ల గురించి మనకు ఎక్కువగా తెలిసింది రామాయణం ద్వారానే. రాముడు పద్నాలుగేళ్ల వనవాస సమయంలో ఎక్కువగా ఈ పండ్లనే తినేవారని అందులో ఉంటుంది. అందుకే ఈ పండును గుజరాత్ లో దేవత ఫలం అంటారు. ఇక మన రాష్ట్రంలో ఈ పండ్లను అమ్మాయిల కళ్లతో పోలుస్తారు మన సినీ కవులు. చూడటానికి అందగా కనిపించే నేరేడు పండ్లను తింటే మాత్రం మంచి ఆరోగ్యం మన సొంతం అంటున్నారు డాక్టర్స్.

health-benefits-of-jamun-fruit

నేరేడు పండ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు:

  • నేరేడు పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, గుండెకు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
  • ఈ పండు రసాన్ని నిమ్మ రసంతో కలిపి తీసుకుంటే మీగ్రెన్ తలనొప్పి తగ్గుతుంది.
  • జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో ఈ పండు రసం కలిపి తాగిస్తే శరీర వేడిని తగ్గించవచ్చు.
  • చాలా మందికి మూత్రం పొసే సమయంలో మంట వస్తుంటుంది అలాంటి వారు నిమ్మరసం, నేసేడు రసం కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • ఈ పండు ముఖ్యంగా కాలేయం పనితీరును మెరుగుపరచడం తో పాటు బ్లడ్ కేన్సర్ కారకాలతో పోరాడుతుంది.
  • ఈ పండ్లను తినే వారి పళ్ల చిగుళ్లు బలంగా ఉంటాయి.
  • నేరేడు చెట్టు ఆకులు యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.
  • నేరేడు గింజలను ఎండబెట్టి పొడిగా చేసి నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర శాతం తగ్గుతుంది.
  • ఐరన్, కార్షియం, పొటాషియం, విటమిన్ సి తదితర పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పళ్లు తింటే.. వ్యాధి నిరోధక శక్తితోపాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది
(Visited 663 times, 1 visits today)