Home / Latest Alajadi / ఉప్పుని ఈ విధంగా వాడండి అద్భుత ఫలితాలు పొందండి.

ఉప్పుని ఈ విధంగా వాడండి అద్భుత ఫలితాలు పొందండి.

Author:

ఎన్ని రకాల ఐటమ్స్ వేసి ఘుమఘుమ లాడేలా వంట చేసినప్పటికీ ఒక్క ఉప్పుని వేయకుంటే ఆ వంట అంతా వ్యర్ధమే. మనకు ఉప్పు యొక్క ప్రాముఖ్యతను తెలిపేందుకు “అన్నేసి చూడు నన్నేసి చూడు” అనే సామెత కూడా ఉంది. అయితే, ప్రస్తుత రోజుల్లో ఉప్పు తక్కువ మోతాదులో తీసుకోమని డాక్టర్లు చెబుతుంటారు. అయితే, అవి అన్ని పక్కన పెడితే చాలా చవకగా లభించే ఉప్పు వల్ల మనకెన్ని రకాల లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of salt

ఉప్పు ఉపయోగించటం వల్ల మనకు కలిగే అద్బుతమైన లాభాలు:

  • కోడిగుడ్డు ఉడకబెట్టి నీటిలో కొద్దిగా ఉప్పు వేస్తె కోడిగుడ్డు తొందరగా ఉడకడమే కాకుండా, ఉడికే సమయంలో గుడ్డుపై చీరికలు(పగుళ్లు)రాకుండా ఉంటుంది.
  • గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పుని వేసి పుక్కిలిస్తే గొంతునొప్పి, గొంతుమంట మరియు గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.
  • వేడి నీటిలో కొద్దిగా ఉప్పుని వేసి, పాదాలను ఆ నీటిలో పెట్టి దానిలో 10 నిమిషాల పాటు అలాగే ఉంచితే పాదాల నొప్పులు తగ్గడమే కాకుండా పాదాల పగుళ్ళు తగ్గుతాయి.
  • మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా..? అని మనం టి.విలో ప్రకటన చూస్తాము కదా! నిజమే, ఉప్పుతో దంతాలను తోముకుంటే… పంటిలోని క్రిములు పోయి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
    గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి, అందులో దూదిని ముంచి ఆ దూదిని కంటి మీద పెట్టుకోవటం వల్ల కంటి కింద ఉబ్బు తగ్గుతుంది.
  • వేడి నీటిలో వెండి వస్తువులను వేసి ఒక 5 నిమిషాలు నానాబెట్టి, ఉప్పు, బేకింగ్ సోడాల మిశ్రమంతో రుద్దితే వెండి వస్తువులు తళ తళ మెరవడం ఖాయం.
  • నోటి పూత మరియు మౌత్ అల్సర్ ను ఉప్పు చాలా సమర్ధంగా ఎదుర్కొంటుంది. ఎందుకంటే వేడి నీరు మరియు ఉప్పు కలిపి, ఆ ద్రావణాన్ని నోటిలో కొద్దిసేపు ఉంచితే నోటి పూత తగ్గిపోతుంది.ఈ విషయాన్ని షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
(Visited 1,263 times, 1 visits today)