Home / health / నువ్వుల వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఎన్నో తెలుసా…!?

నువ్వుల వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఎన్నో తెలుసా…!?

Author:

నువ్వుల పేరు ఎప్పుడైనా విన్నారా! వీనే ఉంటారు. ఈ నువ్వులను వెనుకటి రోజులలో  నూనెగా మార్చి పల్లెల్లో వంటలో వాడే వారు కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది నువ్వుల నూనెను వాడుతున్నారు. పల్లెల్లో చాలా వంటకాలలో నువ్వులను వాడుతారు. ఈ నువ్వులను వలన మనకు చాలా ఆరోగ్యం కలుగుతుంది. ఇందులో చాలా రకాల  పోషకాలు ఉన్నాయి అందుకనే దీనిని ‘పవర్ హౌజ్’ అంటారు చాలా మంది. ఇందులో జింక్,థయామిన్, ఐరన్, మినరల్స్, కాల్షియం, మరియు విటమిన్ ‘E’లను సమృద్ధిగా కలిగి ఉంటాయి.

health-benefits-of-sesame-oil

నువ్వుల వలన కలిగే ఉపయోగాలు చూద్దాం:

గుండె పోటు నివారణ :

నువ్వుల నూనె వాడటం వలన చాలా తక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నూనెలో యాంటీ-అథెరోస్క్లెరోటిక్ ఉండటం వలన హృదయనాళను చురుగా పనిచేసేలా చేస్తోంది. దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానటం లో చాలా సహాయం చేస్తుంది. అలాగే ఇందులో మొనోశాకరైడ్ లు ఉండి  చెడు కొవ్వును తొందరగా కరిగించి మంచి కొవ్వును తయారు చేస్తాయి.

ఎముకల ఆరోగ్యం కోసం :

నువ్వులలో ఉండే జింక్ ఎముకలను దృడంగా ఉండే విధంగా చేస్తుంది.ఎముకల దృఢత్వం కోసం నువ్వులు కాల్షియం, మినరల్స్ ని పుష్కలంగా అందిస్తాయి.

కొవ్వు పదార్థాల తగ్గుదల కోసం :

నువ్వులు ఫైబర్ ను కలిగి ఉంటాయి వీటిని ‘లిగ్నిన్స్’ అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. నల్ల నువ్వులలో ఉండే ఫైటోస్టేరోసిస్ కొవ్వును పోలి ఉన్న ఇది కొవ్వును తగ్గిస్తూ క్యాన్సర్ కణాలను పెరగనియ్యకుండా చేస్తుంది.

పోషణ :

నల్ల నువ్వులు రోజు తినడం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి మన శరీరాన్ని నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ నువ్వులలో ఉండే పోషకాల వలన వయసు పెరిగిన అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది.

సూర్యుని వేడి నుండి రక్షణ:

నువ్వులల్లో ఉండే మూలా శక్తి వలన  U.V కిరణాలు చర్మంపై పాడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత క్యాన్సర్ ని నల్ల నువ్వలు తగ్గిస్తాయి.

కండీషనర్ గా నువ్వుల నూనె :

ఎప్పుడు షాంపూలు వాడిన జుట్టు కొన్ని రోజుల తరవాత తేలిపోతుంది. అలాంటి సమయంలో మీరు నువ్వుల నూనెను జుట్టుకు పట్టిస్తే నువ్వులలోని పోషకాలు జుట్టుకు బలాన్ని ఇచ్చి మీ జుట్టును తిరిగి మాములుగా చేస్తుంది. ఇప్పుడు చాలా మంది బ్యుటీషియన్స్ నువ్వుల నూనెను కేశాలంకారణలో వాడుతున్నారు.

మధుమేహ నివారణ :

నువ్వుల విత్తనాలనుండి తీసిన నూనెలో శక్తి వంతమైన పదార్థాలు అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది.రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను , మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.

(Visited 3,596 times, 1 visits today)