Home / health / మనం ఆరోగ్యంగా ఉండాలంటే చింత చిగురుని ఈ విధంగా ఉపయోగించాల్సిందే…!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే చింత చిగురుని ఈ విధంగా ఉపయోగించాల్సిందే…!

Author:

ఆకు రాల్చే కాలంలో అన్ని చెట్ల మాదిరే, చింత చెట్ల ఆకులు కూడా రాలి పోతాయి. తర్వాత వాటి స్థానంలో లేత చిగురులు వస్తాయి. ఈ చిగురులను సేకరించి కూరలలో వేసుకోవటం మనకు తెలిసిన విషయమే. చింత చిగురు తోనే కొన్ని వంటకాలు చేసుకుంటారు. ఇది రుచికి పుల్లగా వుంటుంది కాబట్టి, చింత చిగురు వేసిన కూరల్లో చింత పండు వేయరు. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో, ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో పుష్కలంగా ఇమిడి ఉంటాయి.

Chintha-Chiguru

చింత చిగురు వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

  • చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే… గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి.
  • కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో థాయు చేసిన ఆహారం తినిపిస్తే ఫలితం ఉంటుంది.
  • జీర్ణాశయ సంబంధ సమస్యలను దూరం చేయటంలో చింత చిగురు చురుగ్గా ఉపయోగపడుతుంది.
  • చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి.
  • తరచూ చింత చిగురును తినటం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.
  • థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు.
  • చింత చిగురు గుండె జబ్బులను దరిచేరనీయదు.
  • శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమయ్యే పోషకాలను అందించడమే గాక, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
  • కీళ్ల నొప్పులతో బాధపడే వారు చింత చిగురును పేస్ట్‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
(Visited 664 times, 1 visits today)