Home / health / బడి పిల్లల ఎదుగుదలకు అడ్డు గా మారుతున్న స్కూల్ బ్యాగ్స్.

బడి పిల్లల ఎదుగుదలకు అడ్డు గా మారుతున్న స్కూల్ బ్యాగ్స్.

Author:

ఏ తల్లి తండ్రులయినా తమ పిల్లలు బాగా ఎదగాలి అనుకుంటారు.. ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే, ఖర్చు ఎంత ఎక్కువైనా కార్పోరేట్ స్కూల్స్ లో జాయిన్ చేసి వారికి మంచి విద్యా బుద్దులు అందాలని తాపత్రాయపడుతుంటారు. కానీ ఈ కార్పోరేట్ స్కూల్స్ పుస్తకాల బరువు పిల్లలనీ, వారి తల్లి తండ్రులనీ ఆర్ధికంగానే కాదు శారీరకంగా, మానసికంగా కూడా క్రుంగదీస్తున్నాయి. ఎల్కేజీ పిల్లాడు కూడా దాదాపు 5 కేజీ ల బరువున్న బ్యాగ్ మోయాల్సి వస్తోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేస్కోవచ్చు. ఈ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ మోత ఇలాగే కొనసాగితే ముందు ముందు పిల్లల వెన్ను పూస వంగిపోయి స్కోలియోసిస్(పార్శ్వగూని) వచ్చే అవకాశముంది అని హెచ్చరిస్తున్నారు పలువురు డాక్టర్లు, పరిశోధకులు. వెన్నుపూస ఒకవైపు వంగిపోవడాన్నే మెడికల్ టర్మినాలజీలో స్కోలియోసిస్(పార్శ్వగూని) అంటారు.

beware of school bags

పిల్లల పుస్తకాల బరువు, పిల్లల ఆరోగ్యం పై వాటి ప్రభావం మీద పరిశోధన చేస్తున్న గాంధీ మెడికల్ కాలేజీ, మల్లా రెడ్డి మెడికల్ కాలేజి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ బరువు మొత్తం డైరెక్టుగా పిల్లల వెన్నుపూస, నడుము మీద పడడం వాళ్ళ వారిలో సహజంగా ఎదిగే ఎదుగుదల తగ్గడంతో పాటు వెన్ను సంబందిత సమస్యలు తీవ్రమయ్యే అవకాశముందని నిర్దారించారు. అలాగే స్కూల్ బ్యాగ్ ధరించే విషయం లో కూడా వీరు తమ పరిశోధన కొనసాగించారు. బ్యాగ్ రెండు బుజాల మీదు గా ధరించడమే మేలు అని సూచిస్తున్నారు. ఒక బుజం మీదుగా బ్యాగ్ వేసుకునే వాళ్ళ వెన్ను పూసా ఎక్కువగా వంగి పోతుండడం వీరి సర్వేలో తేలింది. 271 మంది ఒక వైపు బ్యాగు ధరించే వారికి శారీరక, ఫిజికల్ టెస్టులు చేయగా వారిలో, 21 మందికి వెన్ను వంగిపోతుండగా, 689 మంది రెండువైపుల బ్యాగు ధరించే వారిని శారీరక, ఫిజికల్ టెస్టులు చేయగా వారిలో 13 మందికి వెన్ను వంగిపోతున్నట్టు తేలింది.

దాదాపు వెయ్యి మంది 10-14 ఏళ్ల వయసున్న పిల్లలపై విడతలుగా చేసిన పరిశోధనల్లో ఈ ఆసక్తికరమైన, భయపెట్టే విషయాలు తేలాయి. సో పిల్లలు, తల్లి దండ్రులే కాదు, టీచర్లు కూడా ఈ విషయం పై కాస్త ఆలోచించి పిల్లల బ్యాగ్స్ బరువును తగ్గించే బాధ్యతను స్కూల్ యాజమాన్యం పై వేయడం మంచిది. నిజంగా ప్రతి ఏటా ప్రభుత్వాలు, పేరెంట్స్, అనేక సంఘాలు గగ్గోలు పెడుతున్నా కూడా కేవలం స్కూల్స్, వారి యాజమాన్యం వల్లే ఈ బరువులు ఏటా పెరుగుతున్నాయే కానినీ తగ్గట్లేదు. పేరుకు డిజిటల్ స్కూల్స్, హై టెక్ స్కూల్సే కానీ పిల్లల మోస్తున్న స్కూల్ బ్యాగ్స్ బరువు మాత్రం అడ్డా కూలీలకన్న ఘోరం.

(Visited 273 times, 1 visits today)