Home / Inspiring Stories / షిర్డీకి వెళ్లాలనుకుంటున్నారా..? అయితే బాబా చెప్పిన విధంగా చేసి పుణ్యాన్ని సొంతం చేసుకోండి.

షిర్డీకి వెళ్లాలనుకుంటున్నారా..? అయితే బాబా చెప్పిన విధంగా చేసి పుణ్యాన్ని సొంతం చేసుకోండి.

Author:

షిర్డీకి వెళ్లి బాబాని దర్శించాలనే ప్రయత్నంలో ఉన్నారా..? అయితే మీరు ఖచ్చితంగా ఒక పని చెయ్యాలి, అలా చేస్తే బాబా జీవితకాలం మొత్తం చెప్పినటువంటి పరోపకారంని పాటించిన నిజమైన బాబా భక్తులుగా నిలుస్తారు, ఆ పని ఏంటి అంటే కొన్ని రోజులుగా వాట్స్ యాప్, ఫేస్ బుక్ లలో ఎక్కువగా షేర్ అవుతున్న ఈ పోస్ట్ ని చదివి పాటించండి.

Latur Railway Station

కాకినాడ…సామర్లకోట…రాజమహేంద్రవరం…నిడదవోలు..తాడేపల్లి గూడెం..ఏలూరు…విజయవాడ ఈ రూట్లో షిర్డీ వెళ్లే ప్రయాణికులకు ఓ విజ్ఙప్తి నీరు లేక దాహార్తి తో తల్లడిల్లుతున్న లాతూర్ ప్రజలకి అండగా నిలవండి…!! రైలులో ప్రయాణించే షిర్డీ ప్రయాణీకులు తమ వెంట ఒక 5 లీటర్ల త్రాగు నీరు (మినరల్ వాటర్ కాదు) తీసుకు వెళ్ళి లాతూర్ రోడ్ స్టేషన్ లో ఈ అవసరానిక ఉంచిన డ్రమ్స్ లో పోయగలరు…!! దాహార్తి తో అక్కడ జనం తల్లడిల్లడమే కాకుండా అక్కడ ఆవులూ పశువులూ మృతి చెందుతున్నాయి…!!

మీ ప్రయాణ అవసరానికి తాగడానికి నీరు పెట్టుకొని కేవలం లాతూర్ ప్రజల కోసం ఐదు లీటర్లు పక్కన పెట్టుకొని వారికి అందించగలరు..!! రైలు ఎక్కెదాకానే మోయల్సిన పని కాబట్టి… కాస్త శ్రమదానం అనుకుని ఈ మంచి కార్యక్రమం లో పాల్గొనండి..!! కాకినాడ – విజయవాడ నుండి షిర్డీ వెళ్లే రైలు లాతూర్ రోడ్ స్టేషన్ రాత్రి 9-55 కి చేరుకుంటుంది..!!

సికింద్రాబాద్ నుండి బయలుదేరే అజంతా ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులు కూడా తమ వెంట నీరు తీసుకువెళ్ళి దాహార్తీతో అలమటిస్తున్న మహారాష్ట్ర ప్రజలకి అందించగలరు..!!ఈ కార్యక్రమాన్ని కేవలం 5 లీటర్ల మంచి నీరు అన్న భావనతో కాకుండా మన భారతదేశంలో ప్రజలు ఒకరికి కష్టం వచ్చినపుడు మరొకరు ఎంత అండగా ఉంటారో ప్రపంచ దేశాలకి ఒక సందేశంగా మిగిలిపోవాలి..!! ఇలా మహారాష్ట్ర వైపు వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ విధిగా ఈ చిన్న సాయాన్ని అందించి తోటి భారతీయుడిగా మీవంతు కర్తవ్యాన్ని నెరవేర్చండి..!!

Must Read: మెదటి సారి రైలు ద్వారా నీటిని సరఫరా చేసి చరిత్ర సృష్టించిన మోడీ ప్రభుత్వం.

(Visited 2,842 times, 1 visits today)