Home / Entertainment / హీరో మేకర్ సల్మాన్.

హీరో మేకర్ సల్మాన్.

Author:

Salman khan body gaurd shera's son

“బాలీవుడ్ బ్యాడ్ బోయ్” కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ లో ఉన్న మరో పేరు. ఆయన పై ఉన్న చాలా రకాల కేసులు కూడా ఇదే విషయం నిజమేమో అన్న భావనని కలిగిస్తాయి. సల్మాన్ జీవితం లోకి వచ్చిన ప్రతీ అమ్మాయీ ఆయన విపరీత ప్రవర్తన కారణం గానే దూరం అయ్యారన్నది నిజం. కానీ సల్మాన్ లో ఉన్న రెండో కోణం అతితక్కువ సందర్భాల్లోనే కనిపిస్తుంది.బీయింగ్ హ్యూమన్ ద్వారా సల్మాన్ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసాడు. అంతే కాదు తన సంపాదనలొనూ కొంత భాగం ఈ చారిటీ కోసం ఖర్చు చేస్తున్నడు కూడా. ఆమధ్య సల్మాన్ అధిక మొత్తం లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటూ రేగిన వివాదం సమయం లో “మీరు తీసుకుంటున్న జీతాల విషయంపై నాకు ఆసక్తి లేదు… మరి, నా జీతం విషయంపై మీకు ఎందుకంత ఆసక్తి? నేను తీసుకునే రెమ్యునరేషన్ పెరిగినా, అది బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కే వెళుతుంది” అని చెప్పారు. 2007లో కొన్ని సంస్థలతో కలసి బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ను సల్మాన్ స్థాపించారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న ఎంతో మందికి విద్య, వైద్య సేవలను ఈ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు.

అయితే ఇప్పుదు తాజా విశేషం ఏమిటంటే సల్మాన్ కొత్త టాలెంట్ ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాడు. తన సినిమాల్లో కొత్త హీరోయిన్లకు ఛాన్సు లు ఇవ్వడమే కాదు. సొంత నిర్మాణ సంస్థ సల్మాన్ ఖాన్ ఫిలింస్ ద్వారా కొత్తవాళ్లను వెండితెరకు పరిచయం చేస్తుంటాడు. ఈ మధ్యే ‘హీరో’ సినిమాతో సూరజ్ పంచోలి – ఆతియా శెట్టిలను ఇంట్రడ్యూస్ చేశాడు. త్వరలోనే ఆతియా తమ్ముడు అహాన్ శెట్టిని కూడా హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఇప్పుడు తన బాడీగార్డ్ కొడుకుకు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చాడు.తన దగ్గర చాలా ఏళ్లుగా పని చేస్తున్న తన బాడీ గార్డ్ “షేరా” కొడుకుని తన సొంతం సంస్థలో హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఆ కుర్రాడి పేరు “టైగర్”. 22 ఏళ్ల టైగర్ కోసం ఒక సందర్భం లో ఏదైనా ఉద్యోగం చూడమని అడిగాడత షేరా. ఐతే సల్మాన్ టైగర్ నే తన దగ్గరకు పిలిపించుకొని “నీ కేమవాలనుంది” అని అడిగితే “సినిమాల్లో చేయాలని ఉంది” అని చెప్పాడట ఆకుర్రవాడు . దీంతో టగర్ ని ఒక సినిమాలో హీరో గా రికమండ్ చేయటమే కాదు తనే ఆ సినిమాను నిర్మిస్తానంటూ ముందుకొచ్చాడు కండల వీరుడు.

(Visited 130 times, 1 visits today)