Home / Entertainment / రామ్‌ వెండి తెరకు పరిచయం అయ్యి 10 నేటికి సంవత్సరాలు

రామ్‌ వెండి తెరకు పరిచయం అయ్యి 10 నేటికి సంవత్సరాలు

Author:

ram completes 10 years in Tollywood

దేవదాసు చిత్రం ద్వారా 2006లో పరిచయమైన రామ్‌ పోతినేని తొలి సినిమాతోనే పెద్దహిట్‌ కొట్టారు. మలి చిత్రం జగడం ఫ్లాపైనప్పటికీ రెడీతో కమర్షియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. రామ్‌కు ఎనర్జీ లెవల్స్‌ ఎక్కువ. దాంతో క్యారక్టర్‌ను డామినేట్‌ చేస్తాడనే విమర్శ ఉంది. కందిరీగ (2011) తర్వాత రామ్‌ సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. మధ్యలో చేసిన ఎందుకంటే ప్రేమంట, మసాల, ఒంగోలు గిత్త, పండగచేస్కో, శివమ్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టి రామ్‌ కెరీర్‌ను ప్రశ్నార్థకంలోకి నెట్టాయి. సరైన కథను ఎంపికచేసుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో తాజాగా నేను శైలజ చిత్రంలో నటించారు. సరదా కథనంతో సాగే ప్రేమకథా చిత్రమిది. రామ్‌ తన గత పాత్రలకు భిన్నంగా సహజత్వానికి తగ్గరగా నటించాడు. కథలో కొత్తదనం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సక్సెస్‌ బాటలోకి వచ్చాడు. కమర్షియల్‌గా ఈ చిత్రం విజయం సాధించింది అని సినీ వాణిజ్య వర్గాలు తేల్చాయి. దాంతో గత నాలుగేళ్ళుగా వెనకబడిన రామ్‌ ముందుకొచ్చేశాడు. ఇక ముందు కూడా తన చిత్రాల కథల ఎంపికలో శ్రద్ద చూపిస్తే రామ్‌ ఫామ్‌లో కొనసాగుతాడని భావిస్తు తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా ఆల్ ది బెస్ట్ రామ్‌

(Visited 145 times, 1 visits today)