Home / Entertainment / మీడియా ముసుగులో ఎం చెప్పినా చెల్లదు అంటున్న రామ్ అభిమాని.

మీడియా ముసుగులో ఎం చెప్పినా చెల్లదు అంటున్న రామ్ అభిమాని.

Author:

ram fan slams media channel

భారతదేశంలో మీడియా పరిస్థితీ అందరికి తెలిసిందే. ఇప్పుడే ఒక చ్యానెల్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ వింటే, మరొక్షణం ఇంకో చ్యానెల్ లో దానికి పుర్తిగా ఆపొసిట్ వే లో ఇంకో వార్త వస్తుంది. ఏది నమ్మాలో జుట్టు పీక్కునే పరిస్తితి సాధారణ ప్రజానీకంది. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అని గట్టిగా వాదించే ఒక మీడియా చ్యానెల్ని అంతే గట్టిగా ప్రశ్నించాడు హీరో రామ్ అభిమాని ఫణి.

గత కొన్ని రోజులుగా నేను శైలజ సినిమా విషయంలో ఒక న్యూస్ చ్యానెల్ కి, హీరొ రామ్ కి జరుగుతున్న మాటల యుద్దం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యింది. నేను శైలజ సినిమా విడుదల అయ్యి అన్ని సెంటెర్లలో మంచిగానే ఆడుతుంది. ఆ సినిమాకి దాదాపు అన్ని పేరుగల రివ్యూ వెబ్‌సైట్లు మంచి పాసిటివ్ రివ్యూస్ ఇచ్చాయి. కానీ ఒక మీడియా సంస్థ మాత్రం సినిమా అసలు బాగోలేదు అంటూ వార్త కధనాన్ని ప్రసారం చేసింది. సినిమా అందరికి నచ్చాల్సిన పనిలేదు కాబట్టి అందరూ ఆ వార్తని వదిలేశారు. హీరో రామ్ కూడా ట్విట్టర్ లో నేను శైలజ సినిమా ఒక మీడియా సంస్థకి తప్ప అందరికి బాగా నచ్చుతుంది అంటూ చిన్న సటైర్ వేసి వూరుకున్నాడు. దానితో నొచ్చుకున్న ఆ చ్యానెల్ ప్రతిరోజు హీరో రామ్ ని తక్కువచేస్తూ, అన్నింటికీ ముడిపెడుతూ ఏదో ఒక వార్త రాయడం మొదలుపెట్టింది. ఇదంతా ఏదో కావాలనే చేస్తున్నట్లు అర్ధమైన రామ్ అభిమానులు ఆ వార్తలను ఖండించడం మొదలుపెట్టారు. ఇదే విషయంలో హీరో రామ్ కి సంభంధించిన ఒక వార్త వీడియోని తమకు తెలియకుండా తీసేవేసాడు అన్న ఆరోపణలతో సదరు మీడియా సంస్థ రామ్ అభిమాని అయిన ఒక ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసివేసింది. ఇక్కడే గొడవ మరింత పెద్దది అయ్యింది. తన సినిమా వల్ల ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తికి నేను అండగా నిలబడి ఇంకో ఉద్యోగం వచ్చే వరకు నేనే జీతం ఇస్తానని రామ్ ప్రకటించాడు.

ఈ విషయాన్ని కూడా వక్రార్ధం వచ్చే విధంగా నమ్మకద్రోహులకు సాయం చేస్తున్న రామ్ అంటూ ఇంకో కథనాన్ని ప్రచురించింది. దీనితో ఆగ్రహానికి గురి అయిన ఒక రామ్ అభిమాని అసలు ఆ చ్యానెల్ ఎలా రామ్ సినిమా పై ఎలా దుష్ప్రాచారం చేస్తుందో, అసలు ఆ సంస్థ ఉద్యోగి ఎందుకు ఉద్యోగం నుండి తీసివేయబడ్డాడో ఒక చిన్ని వీడియో ద్వారా వివరించాడు. ఆ వీడియో మీరుకూడా చూడండి.

(Visited 1,631 times, 1 visits today)