Home / Entertainment / నా సినిమా అంటేనే హీరోయిన్స్ పారిపోతున్నారు.

నా సినిమా అంటేనే హీరోయిన్స్ పారిపోతున్నారు.

Author:

Srikanth Telugu Movie Actor

మొదట్లో చిన్న చిన్న పాత్రలతో, ఆ తర్వాత విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు తాజ్‌మహల్ తో హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు.ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా చిరంజీవి అభిమానియైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్ తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించాడు.బాలకృష్ణ తో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో… ఇంకా అగ్ర కథానాయకులయిన వెంకటేష్ తో కలిసి సంక్రాంతి, నాగార్జున తో కలిసి నిన్నే ప్రేమిస్తా, డా.మంచు మోహన్ బాబుతో తప్పుచేసి పప్పుకూడు, డా.గద్దె రాజేంద్ర ప్రసాద్ తో సరదాగా సరదాగా మొదలయిన వాటిలో నటించాడు.అలాగే తనతో సమానమైన నటులయిన జగపతిబాబు తో మనసులో మాట, జె.డి.చక్రవర్తి తో ఎగిరే పావురమా,రవితేజ తో ఖడ్గం లలో వారితో కలిసి నటించాడు.

ఫ్యామిలీ & యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరోఫ్యామిలీ & యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నఈ హీరో శ్రీకాంత్ , ఇప్ప్డు హీరోయిన్స్ సహకరించడం లేదని తన బాధను వ్యక్త పరిచాడు..తాజాగా తను నటించిన వీడికి దూకుడేక్కువ చిత్ర రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ హీరోయిన్స్ ఫై అలాగే ఫ్యామిలీ కథల ఫై మాట్లాడాడు…

ఫ్యామిలీ సినిమాలే తనను ఇంతటి వాడిని చేశాయని , ఇప్పుడు ఆ తరహా సినిమాలు రావడం లేదని, ఆ మద్య ఫ్యామిలీ కథల ఆదరణ తగ్గిందని , కానీ ఇప్పుడు మళ్లీ అవే ప్రేక్షకులు కావాలంటున్నారని చెప్పాడు..అంతే కాదు ఫ్యామిలీ అంత చూడదగ్గ చిత్రాలు రావాలంటే కృష్ణ రెడ్డి గారు మళ్లీ రావాల్సిందే నని తెలిపారు…

అలాగే “ఫ్యామిలీ సినిమాలు సూపర్ హిట్ కావాలంటే హీరో తో పాటు హీరోయిన్స్ కూడా తమ వంతు కృషి చేయాలి , కానీ ఇప్పుడు వచ్చిన హీరోయిన్స్ కేవలం సాంగ్స్ కే తప్ప కథ ఫై ఇంటర్స్ట్ చూపించడం లేదు..ఉన్న 10 మంది హీరోయిన్స్ లా చుట్టే కథ తీరుగుతుంది..వాళ్ళు కూడా పాటలకు , కొన్ని సీన్లకే పరిమితమయ్యే పత్రాలు చేయడానికి ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది” అంటూ తన మనసులోని బాధను తెలిపాడు.హీరోయిన్స్ సహకరించడం లేదని తన బాధను వ్యక్త పరిచాడు..…

(Visited 127 times, 1 visits today)