Home / Entertainment / మరిచిపోయే సమయంలో మళ్ళీ వస్తున్న తరుణ్

మరిచిపోయే సమయంలో మళ్ళీ వస్తున్న తరుణ్

Author:

Tharun

నువ్వేకావాలి వంటి సూపర్‌హిట్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన తరుణ్ ఆ తరువాత వరుస విజయాల్ని దక్కించుకుని లవర్‌బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. కెరీర్ ప్రారంభించిన మొదట్లో ప్రేమకధా చిత్రాలతో తెలుగులో తనదైన మార్క్ క్రియేట్ చేసి వరుస హిట్లతో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ సంపాదించాడు హీరో తరుణ్.., ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సినిమా అవకాశాలు కూడా కరువయ్యాయి. ఇక వెండితెరపై అలా కనిపించకుండాపోయిన తరుణ్ ని సినీ ప్రేక్షకులు కూడా దాదాపుగా మరిచిపోయే సమయంలో తాజాగా తరుణ్ మరోసారి హీరోగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. తనని కెరీర్ లో మంచి స్థానంలో నిలబెట్టిన లవ్ స్టోరీలనే నమ్ముకుంటున్నాడు.

రమేష్ గోపి దర్శకత్వంలో ఒక విభిన్న ప్రేమకథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్ వి ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే జనవరి 8న తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఇక ఈ చిత్రంలో తరుణ్ సరసన ఓవియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో ఎంత కాలం ప్రేమించామన్నది కాదు ఎంతబాగా ప్రేమించాము అనేది ముఖ్యం అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టి హీరోగా ఫామ్ లోకి రావాలని కోరుతూ హ్యాపీ బర్త్ డే తరుణ్..

(Visited 83 times, 1 visits today)