Home / Latest Alajadi / Video: మోడీ స్పీచ్ లోని ముఖ్యాంశాలు…!

Video: మోడీ స్పీచ్ లోని ముఖ్యాంశాలు…!

Author:

నవంబర్ 8 న జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోడీ, ఆరోజు దేశంలో ఉన్న 125 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపించే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు, ఈరోజు కూడా జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు అనే ప్రకటన వచ్చినప్పటి నుండి దేశ ప్రజలు మళ్ళీ ఎలాంటి కఠిన నిర్ణయాన్ని ప్రకటిస్తారో అని న్యూ ఇయర్ కి ముందు మళ్ళీ ఎలాంటి బాంబు పేలుస్తారో అని దేశ ప్రజలంతా టీవీలకి అతుక్కుపోయారు.

ప్రధాని మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు

ఈరోజు 730 ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ రైతులకి, గ్రామాలలో నివసించే వారికి, మధ్య తరగతి ప్రజలకి తోడ్పడేలా కొన్ని నిర్ణయాలని ప్రకటించారు. మోడీ ప్రసంగంలో చెప్పిన ముఖ్యాంశాలు మీ కోసం.

  •  భారతదేశాన్ని నూతన దిశలో నడిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు సహృదయంతో స్వీకరించారని ప్రధనమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
  • నోట్ల రద్దు తర్వాత జనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారని, అయితే ఆ నిర్ణయంతో నల్లధనం, అవినీతి రూపుమాసిపోతాయని తాను మరోసారి చెబుతున్నానని ప్రధాని అన్నారు.
  • నరేంద్ర మోదీ దేశంలోని సీనియర్ సిటిజన్లు, గర్భిణీలకు శుభవార్త చెప్పారు. రూ.7.5 కోట్లు ఫిక్సిడ్‌ డిపాజిట్ చేసిన వారికి పదేళ్ల వరకూ 8 శాతం వడ్డీ లభిస్తుందని ప్రకటించారు.
  • గర్భిణీ స్త్రీలకూ సైతం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. స్పెషల్ హెల్త్ స్కీమ్ కింద గర్భిణీ స్త్రీలకు మెటర్నటీ అసిస్టెన్స్ కింద రూ.6 వేలు మంజూరు చేసి వారి ఖాతాల్లో జమచేయడం జరుగుతుందని ప్రకటించారు.
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం కోసం 9 లక్షల రుణం తీసుకునేవారికి 4 శాతం వడ్డీపై రాయితీ ఇస్తారు. అలాగే 12 లక్షల రూపాయల రుణం తీసుకునే వారికి 3 శాతం వడ్డీపై రాయితీ ఇస్తారు.
  • ఇళ్ల మరమ్మతుల కోసం 2 లక్షల రూపాయల రుణాలు ఇస్తారు. ఈ రుణాలపై 3 శాతం వడ్డీపై రాయితీ ఇస్తారు. ప్రధాని ప్రకటనతో ఉద్యోగస్తులకు, మధ్య తరగతివారికి ప్రయోజనం చేకూరనుంది.

(Visited 2,436 times, 1 visits today)