Home / Inspiring Stories / పోలీస్ లుగా మారనున్న కోల్ కతా హిజ్రలు.

పోలీస్ లుగా మారనున్న కోల్ కతా హిజ్రలు.

Author:

విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటం లో భారత దేశం లోనే ముందుండే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది .అదే మిటంటే హిజ్రాలని పోలీస్ ఫోర్స్ లోకి తీసుకోనున్నారట. ఉత్తర భారత దేశంలో హిజ్రలు అధికంగా ఉండే ప్రదేశాల్లో కోల్ కతా కూడా ఒకటి. అధిక సంఖ్యలో ఉండే వీరిపై ఎవరూ ఆలోచించనంత ఉన్నతంగా ఆలోచించి వారికంటూ ఉండే ఒక అస్తిత్వాన్ని గుర్తించిన మొదటి రాశ్ట్రం బెంగాల్. ఇది వరకే మనభీ బందోపాధ్యాయ అనే ఒక హిజ్రాని ఒక కాలేజీ కి ప్రిన్సిపల్ గా చేసి న బెంగాల్ మానవాభివృద్ది వనరుల శాఖ ఒక విప్లవాత్మకమైన నిర్ణయాని తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. భారత్ లాంటి దేశాల్లో ఇటువంటి పరిణామం మాలుదేం కాదు. ఈ ఘటనతో దేశవ్యాప్త హిజ్రాలలో ఆత్మ విశ్వాసం పెరిగింది.మిగిలిన పౌరులలో కూడా వారంటే ఉన్న వ్యతిరేఖ భావన కూడా కొంతవరకూ తగ్గిపోయి హిజ్రాలకూ చదువుకోవటానికీ అవకాశం  ఏర్పడింది…

అదే బాటలో ఈ సారి బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంకా ఆశ్చర్య కరం అయినా అదీ అహ్వానించదగ్గదే. హిజ్రాలని Civic Police Volunteer Force (CPVC) లోకి తీసుకొని.. వారి ద్వారా నైట్ డ్యూటీలు చేసే మహిళా ఉధ్యోగులకూ,రైల్వే స్టేషన్ ల దగ్గర్ వచ్చే మహిలలకూ రక్షణ కోసమూ ఇంకా ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకుంటారట.  పోలీస్ ఫోర్స్ లోకి తీసుకొని వారి ద్వారా నైట్ డ్యూటీలు చేసే మహిళా ఉధ్యోగులకూ,రైల్వే స్టేషన్ ల దగ్గర్ వచ్చే మహిలలకూ రక్షణ కోసమూ ఇంకా ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకుంటారట. వీరిని గ్రీన్ పోలీసులు గా వ్యవహరిస్తారు. పశ్చిమ బెంగాల్ స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి అయిన శ్రీమతి శశి పంజా బెంగాల్ హిజ్రా డెవలప్ మెంట్ బోర్డ్ వారి మీటింగ్ లో ఈ విషయాన్ని ప్రతిపాదించారు.

hijras-will-now-be-a-part-of-kolkata-police 1

 

“ఇప్పటి వరకూ హిజ్రాలపై ఉన్న వివక్ష దారుణంగా కొనసాగుతూనే ఉంది, అందుకే వారిని ఇలా కొన్ని సేవారంగ వృత్తులలో నియమించినపుడు వారి పట్ల సమాజ ధోరని మారుతుంది ఈ వివక్ష పోవాలంటే ఇటువంటి నిర్ణయాలు తప్పక తీసుకోవలసిందే” అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె చెప్పారు.

మార్పు ఇప్పుడిప్పుడే మొదలౌతోంది కానీ సాధారణ మనుషులతో సమాన మైన, న్యాయంగా తమకు ఉండే హక్కులను పొందాలి అంటే ఇంక చాలా  కాలమే పట్టొచ్చు…

(Visited 108 times, 1 visits today)