Home / health / చిరాకు తెప్పించే తామరని తగ్గించే శక్తి వంతమైన ఆయుర్వేద ఔషదాలు.

చిరాకు తెప్పించే తామరని తగ్గించే శక్తి వంతమైన ఆయుర్వేద ఔషదాలు.

Author:

తామర అనేది చర్మం యొక్క బాహ్యపొరపై ఫంగల్ ఇన్ఫెక్షన్ ల వలన కలిగే సాధారణ వ్యాధి మరియు చాలా సంక్లిష్టతలకు గురి చేస్తుంది. చర్మంపై ఎర్రగా, వృత్తాకారంలో ఏర్పడి, చర్మ మధ్యలో దురదను కలుగచేస్తుంది. సాధారణంగా బాహ్యమూలాలలో, కాళ్ళలో ఏర్పడుతుంది మరియు శరీర ఇతర భాగాలలో కూడా ఏర్పడవచ్చు. ఇది సక్రమించినట్లైతే ఎనలేని దురద పెడుతుంది. ఒక వైపు మంట మరోవైపు దురద పుట్టడం వలన ఏ పనిపై దృష్టి సారించలేము. తామరవ్యాధిని తగ్గించే శక్తి వంతమైన ఔషదాల గురించి ఇక్కడ తెలుపడం జరిగింది.

home-remedies-for-ringworm

వెల్లుల్లి:
వెల్లుల్లి ‘ఎజోయేన్’ అనే యాంటీ ఫంగల్ కారకాలను కలిగి ఉంటుంది. ఈ సమ్మేళనం చాలా రకాల ఇన్ఫెక్షన్ ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిని దంచి నేరుగా తామర ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి. దీనికి తేనె లేదా ఆలివ్ ఆయిల్ కలపటం వలన వెల్లుల్లి మరింత శక్తివంతంగా పని చేస్తుంది. కనీసం రెండు వారాల వరకు రోజులో 2 నుండి 3 సార్లు ఈ విధంగా చేయటం వలన మంచి తామరవ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు.

బొప్పాయి పండు:
తాజా బొప్పాయి పండు, గాయాలపై నూతన కణాలను ప్రభావిత పరచకుండా, నిర్జీవ కణాలను తొలగిస్తుంది. తామర సోకటం వలన ఏర్పడే నిర్జీవ కణాలు చర్మ ఉపరితలంపై ఉంటాయి. బొప్పాయి పండులో ఉండే పపాయిన్ మరియు కైమోపపాయిన్ ఎంజైమ్ లు వైరస్, ఈస్ట్ మరియు ఫంగస్ వంటి వాటి కణత్వచాలను నాశనం చేసి, ఇన్ఫ్లమేషన్ మరియు కాలిన గాయాల నుండి ఉపశమనం కలిస్తుంది. తాజా బొప్పాయి పండు ముక్కను తీసుకొని, తామర ప్రభావిత ప్రాంతాలలో రాయటం వలన ఉపశమనం పొందుతారు

కొబ్బరి నూనె:
తామరను తగ్గించుటలో శక్తివంతంగా పని చేసే మరొక సహజ ఔషదం కొబ్బరి నూనె. ఇది ఫంగస్ ల యొక్క అతిధేయులను తొలగిస్తుంది. కొబ్బరు నూనె ‘లౌరిక్ ఆసిడ్’ ను కలిగి ఉండి, తామరను కలుగచేసే ఫంగస్ ను వినాశనం చెందిస్తుంది. అంతేకాకుండా, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉండే లౌరిక్ ఆసిడ్ అన్ని రకాల సుక్ష్మజీవులను చంపి చర్మాని కాపాడుతుంది. కొన్ని నిమిషాల పాటు కొబ్బరి నూనెను తామర ప్రభావిత ప్రాంతాలలో మసాజ్ లేదా మర్దన చేయటం మూలంగా తామర నుండి ఉపశమనం పొందవచ్చు.

ఉప్పు నీరు:
ఉప్పునీరు అద్భుతమైన ఆస్ట్రిజెంట్ గా మరియు గాయాలను తగ్గించే ఔషదంగా పని చేస్తుంది. ఉప్పు నీరు ప్రభావిత ప్రాంతాలలో ఇన్ఫెక్షన్ లను తొలగించే గుణాలను కలిగి ఉంటుంది. ప్రభావిత ప్రాంతాన్ని ఉప్పు నీటిలో ఉంచండి లేదా సముద్రపు ఉప్పు నీటి పేస్ట్ ను ఇంఫెక్ష్సన్ లకు గురైన ప్రాంతంలో అప్లై చేయండి.

కలబంద:
కలబంద యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలను కలిగి ఉంటుంది. చర్మ సమస్యలను తగ్గించుటలో కలబంద శక్తివంతంగా పని చేస్తుంది ముఖ్యంగా తామర వ్యాధికి సమర్థవంతంగా పని చేస్తుంది. కలబంద గుజ్జును తామర ఏర్పడిన ప్రాంతంలో పూసి, 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఎండిన తరువాత నీటితో కడిగి వేయండి. త్వరిత ఉపశమనం పొందటానికి గానూ, రోజులో రెండు లేదా మూడు సార్లు ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి.

(Visited 1,635 times, 1 visits today)