Home / Uncategorized / కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలివిగో..

కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలివిగో..

Author:

మానవదేహం లో మెదడు, హృదయం తో పాటుగా మూత్రపిండాలు కూడా చాలా ముఖ్యమైన అవయువాలు. ఇవి చిక్కుడు గింజ ఆకారం లో ఉండి, వీపుకి మధ్యభాగంలో కడుపుకి వెనకభాగంలో ఉంటాయి. ఇవి నిత్యం రక్తాన్ని వడకడుతూ, రక్తంలో ఉండే నీటిని, ఇతర మలినాలని వేరు చేస్తుంటాయి. శరీరంలో నీటి – లవణ సమతుల్యతను కాపాడుతూ, రక్తపోటుని నియంత్రించడంలో తోడ్పడతాయి.

కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ఎలా గుర్తించడం?

మనం తినే ఆహారం జీర్ణం అయి రక్త ప్రవాహంలో కలసినప్పుడు అనవసరమైన పదార్ధాలు కొన్ని రక్తంలో చేరతాయి, ఇవి తరవాత మలినాలుగా మారి మూత్రపిండాల ద్వారా శరీరం నుండి బయటకి విస‌ర్జింపబ‌డ‌తాయి. కొన్నిసార్లు ఆ మలినాలు పెద్దవిగా మారి, మనం విసర్జించే సమయంలో అడ్డంకిగా మారి విపరీతమైన నొప్పిని క‌లుగ‌జేస్తాయి. అలా పెద్దవిగా మారిన మలినాలనే కిడ్నీస్టోన్స్ అంటారు. మూత్రం చేసేటప్పుడు మంటగా ఉండటం, మూత్రం రంగు మారటం, అలసటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే కిడ్నీ లో స్టోన్స్ ఉన్నట్టుగా భావించవచ్చు .

కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండేందుకు  – ఇంటి చిట్కాలు

ఆపిల్ సైడర్ వెనిగర్ :

మనకి మార్కెట్ లో ఆయిల్ సైడర్ వెనిగర్ దొరుకుతుంది. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ ఆలివ్ఆయిల్ ను ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కిడ్నీ లో నొప్పి క్రమేణా తగ్గుతుంది.

apple

దానిమ్మ జ్యూస్ ;

కడుపులోని చెత్తను పారద్రోయగల శక్తి దానిమ్మ పండుకు ఉంది. దానిమ్మ ను జ్యూస్ రూపం లో లేదా దానిమ్మ గింజలు తినడం మంచింది. ఆహరం తీసుకునే ముందు జ్యూస్ తాగడం మంచిది.

pomegranite

తేనె తులసి రసం :

కిడ్నీలో ఉన్న స్టోన్స్ కరిగిపోవడానికి తేనె తులసి రసం బాగా పనిచేస్తుంది. కొన్ని తులసి ఆకులని తీసుకొని వాటిని రసం వచ్చేలా దంచి, ఆరసం లో ఒక స్పూన్ తేనె కలుపుకొని ప్రతిరోజూ ఉదయం సేవించాలి. ఇలా చేయడం వలన స్టోన్స్ కుడా  ఏర్పడకుండా ఉంటాయి.

honey

కొత్తిమీర రసం :

కొత్తిమీర ఆకులని మనం చాల వంటకాల్లో అలంకారానికి వాడుతుంటాము. కానీ వాటికి కిడ్నీ లో రాళ్ళని కరిగించే శక్తి ఉందని చాలా కొద్దిమందికే తెలుసు. కొత్తిమీర ఆకులని బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించిన జ్యూస్ ను వేడి చేసుకొని రోజు కొద్దిగా తీసుకుంటే కిడ్నీ లో స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయి.

coriander

నీళ్ళు:

అందరికి అందుబాటులోఉండే చిట్కా. రోజుకి కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవడం మంచిది. ఇది మూత్రపిండాలను శుభ్ర‌ప‌ర‌చ‌డంతోపాటు, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

water

తేనె నిమ్మరసం :

పరగడుపున రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ తేనె నీట్లో కలిపి తీసుకుంటే కిడ్నీ లో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)