Home / health / గురకతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

గురకతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

Author:

ప్రతి జీవికి నిద్ర అనేది చాలా అవసరం, సరిగ్గా నిద్ర పోకపోతే చాలా రోగాలు వస్తాయి, రోజుకి సరిపడా నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారని చాలా పరిశోధనలు తేల్చి చెప్పాయి. మామూలుగానే మనకు నిద్ర పట్టదు, అలాంటిది ఎవరైనా మన పక్కకు పడుకున్నవారు గురక పెడుతున్నట్లైతే ఆ భాధ వర్ణనాతీతం. ఒక వైపు నిద్ర రాదు, ఆ శబ్దానికి ఎం చేయాలో అర్ధం కాదు. అసలు గురక ఎందుకు వస్తుందంటే, బరువు ఎక్కువగా ఉండడం, ఆల్కహాల్‌ అలవాటు ఉండటం వల్ల గురక వస్తుంది. నిద్రించే సమయంలో ముక్కు, గొంతు ద్వారా గాలి సరిగ్గా ఆడకపోవడం వల్ల ఆ చుట్టుపక్కల కణాలు వైబ్రేట్‌ అవుతాయి. అందువల్లే గురక వస్తుంది. మద్యపానం, పొగతాగడం కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కండరాలు బిగువు కోల్పోయి గురక ఎక్కువ అవుతుంది.

reduce-snoring

ఇలా ఇంట్లో ఉపయోగించే పధార్ధాలతో గురక తగ్గించుకోవచ్చు:

  • మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలపై ముసుగులా కప్పుకొని పెట్టి రాత్రి నిద్రపోయే ముందు 10 నిమిషాల పాటు ముక్కు ద్వారా ఆవిరి పీల్చాలి.
  • ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడి చేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో పోసి పీల్చుతుంటే క్రమంగా గురక సమస్య తగ్గుతుంది.
  • అర టీ స్పూన్‌ యాలకుల పొడి ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకున్నట్లైతే చక్కటి ఫలితం లభిస్తుంది.
  • 2 టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది.
  • అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తీసుకుంటే గురక తగ్గుతుంది.
  • ఈ చిట్కాలు పాటించినప్పటికీ గురక తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
(Visited 7,003 times, 1 visits today)