Home / health / నడుము, కీళ్ల నొప్పులని సహజంగా తగ్గించుకోవాలంటే ఇలా చేయండి.

నడుము, కీళ్ల నొప్పులని సహజంగా తగ్గించుకోవాలంటే ఇలా చేయండి.

Author:

ప్రస్తుత రోజుల్లో మనుషులంతా మర మనుషులుగా అయిపోయారు. యంత్రాలుగా పనిచేయడం మొదలు పెట్టి ఆరోగ్యాన్ని విడిచిపెట్టారు. గంటల కొద్దీ కూర్చొని పని చేయడంవలన శరీరంలో ఏ అవయవం చురుగ్గా పనిచేయక చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా ఎక్కువ సమయం కూర్చునే వారికి వెన్ను, మెడ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.మన శరీరాల్లోని ఎముకలు బలహీనంగా మారడం వలన ఇలాంటి నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఎముకల్లో కాల్షియం తగ్గడం వలన కీళ్లనొప్పులు వస్తుంటాయి. ఇలాంటి నొప్పులు తగ్గాలంటే ” అటుకులు మరియు పెరుగు” పదార్థాలను కలిపి తింటే మనకు సరిపోయే కాల్షియం దొరుకుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

home-redemies-for-back-pain-knee-pain

ఎలా తినాలి:

పచ్చి మిర్చి,పోపుదినుసులు, జీలకర్ర, పసుపు,ఉప్పు తగు మోతాదులో వేసి కొద్దీ సమయం వీటన్నింటిని కలిపి వేయించిన తరువాత వీటిని పెరుగులో కలపాలి. కడిగిన అటుకులను పెరుగుతో కలిపేస్తే సరిపోతుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర కలుపుకొని తింటే రుచిపరంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది.

ఎలాంటి సమయంలో తినాలి:
మీరు ఈ పదార్థాన్ని ఎలాంటి సమయంలోనైనా తినవచ్చు. మధ్యాహ్నం సమయంలో అయితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

(Visited 2,837 times, 1 visits today)