Home / health / పూదీనా, నిమ్మకాయలతో చేసిన ఈ స్ప్రేతో దోమలను తరమికొట్టండి.

పూదీనా, నిమ్మకాయలతో చేసిన ఈ స్ప్రేతో దోమలను తరమికొట్టండి.

Author:

శీతాకాలంలో వచ్చే చాలా అనారోగ్యాలకు కారణం ఈగలు, దోమలే . సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వీటి వలన రెస్ట్ అనేది లేకుండా పోతోంది. రాత్రి ప్రశాంతముగా పడుకునే సమయంలో దోమల వలన నిద్ర సరిగా పట్టక చాల ఇబ్బంది కలుగుతుంది. వీటి నివారణకు చాలా ఖరీదైన స్ప్రేలు, హిట్ లు వాడిన ఫలితం శూన్యం ..పైగా అవన్నీ రసాయానికమైనవి, వాటి వలన అనేక రోగాలు కొనితెచ్చుకోవడమే అవుతుంది మరియు అవి చాల ఖరీదైనవి కూడా. కాని అటువంటి బాధలు లేకుండా ఇంట్లోనే తయారుచేసుకునే ఒక మిశ్రమంతో దోమలు, ఈగలు మరియు ఇతర కీటకాలను తరమివేయోచ్చు. ఆ మిశ్రమం గురించి తెలుసుకోండి

spray-for-mosquito

మిశ్రమం తయారుచేసుకునే విధానం:

. ముందుగా నిమ్మ లేదా నారింజ పండు యొక్క తొక్కలని తీసి పక్కకు పెట్టుకొవాలి
. కొన్ని పుదీనా ఆకులు తీసుకొని శుభ్రముగా కడిగి పెట్టుకోవాలి.
. ఒక పాత్రలో కొన్ని నీటిని తీసుకోని, ఆ నీటిలో నిమ్మ లేదా నారింజ పండు యొక్క తొక్కలని మరియు పుదీనా ఆకులను స్టౌ పై ఉంచి తీసుకున్న నీరు సగం అయ్యేదాక మరగ బెట్టాలి.
. ఈ మిశ్రమాన్ని చలార్చి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి.
. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడబోసి ద్రవాన్ని వేరు చేయాలి.
. అలా వేరు చేసిన ద్రవంలో రబ్బింగ్ ఆల్కహాల్(దీనిని సర్జికల్ స్పిరిట్ అని కూడా అంటారు, ఇది మార్కెట్ లో దొరుకుతుంది) సమానంగా కలపాలి.
. కలిపిన మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిలో నింపుకొని దోమలు,ఈగలు, బొద్దింకలు, ఎలుకలు ఉన్న ప్రాంతాలలో స్ప్రే చేయాలి అంతే ఇక వాటి నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

(Visited 3,908 times, 1 visits today)