Home / health / తేనెలో నానబెట్టిన ఉసిరికాయలని తినటం వల్ల చాలా అనారోగ్యాలకి చెక్ పెట్టవచ్చు.

తేనెలో నానబెట్టిన ఉసిరికాయలని తినటం వల్ల చాలా అనారోగ్యాలకి చెక్ పెట్టవచ్చు.

Author:

పకృతి పరంగా దొరికే తేనెతో మనకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ శీతాకాలంలో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి… ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన మనకు కావాల్సిన పోషకాలు అధిక లభిస్తాయి. అలాగే ఎన్నో రకాల అనారోగ్యాలను మనకు దూరం చేస్తాయి.తేనె,ఉసిరి కాయలను ఎలా తినాలో, ఈ మిశ్రమం వలన కలిగే ఫలితాలు తెలుసుకొద్దాం…

ముందుగా ఒక జార్ తీసుకోని అందులో సగం వరకు తేనెతో నింపాలి. ఇందులో బాగా కడిగి ఆరబెట్టినా ఉసిరికాయలను వేయాలి. తరవాత జార్ కు మూత బిగించి దానిని భద్రపరచాలి. కొద్దీ రోజుల వరకు ఉసిరికాయలు తేనెలో పండ్ల జామ్ లా మారిపోతాయి. ఇలా మారిపోయిన ఉసిరికాయలని రోజుకొకటి చొప్పున జార్ లోని తేనెను కలుపుకొని రోజు ఉదయం పరిగడుపున తినాలి.

honey-and-amla-juice

ఇలా చేయడం వలన కలిగే ప్రయోజనాలు :

లివర్ సమస్యలకు :
ఈ మిశ్రమం వలన లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యంగా తయారు అవుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే ఈ మిశ్రమం వలన త్వరగా నయం అవుతాయి. శరీరంలోని వ్యర్థ పదార్ధాలను బయటకి పంపడంతోపాటు లివర్ ని మరింత చురుగ్గా పనిచేయిస్తుంది.

ఆస్తమాకు :
చలికాలంలో ఆస్తమా ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వారు శ్వాస సరిగా తీసుకోలేరు. ఈ తేనె, ఉసిరికాయల మిశ్రమాన్ని తీసుకుంటే ఆస్తమా నుండి ఉపశమనం కచ్చితంగా లభిస్తుంది. తేనె, ఉసిరిలో ఉండే సహజ సిద్దమైన పోషకాలు ఆస్తమానూ దూరం చేస్తాయి. శ్వాస కోశ సమస్యలు రాకుండా చేస్తాయి.

చర్మంపై ముడుతలు రాకుండ :
వయస్సు మీదపడటం వలన చర్మం ముడుతలు పడుతుంటుంది. ఇలాంటి సమయంలో తేనె, ఉసిరి మిశ్రామన్ని తీసుకుంటే ముడుతలు రాకుండా చేస్తూ చర్మాన్ని కాంతి వంతగా చేస్తుంది.

వెంట్రుకల సంరక్షణకు:

తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకోవడం వలన వెంట్రుకలు దృడంగా, ఒత్తుగా పెరుగుతాయి. అలాగే వెంట్రుకలలో షైనింగ్ కూడా పెరుగుతుంది.

అధిక బరువు నుండి విముక్తి :
ఈ మిశ్రమము వలన శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. దానితో అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుతుంటారు. అధిక బరువుతో బాధపడేవారికి ఇది చక్కటి ఔషధం.

సంతాన కోసం :
ఈ మిశ్రమం వలన స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. దీని వలన రుతుక్రమం సరిగ్గా అవుతుంది. పిల్లలు కలిగేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇదే మిశ్రమం మగవారిలో అయితే వీర్య నాణ్యతని, లైంగిక పటుత్వం ఎక్కువగా పెంచుతుంది.

వ్యర్థ పదార్థాలకు :
ఈ మిశ్రమం శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకి పంపిస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తం ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో ఇక వారికి గుండె జబ్బులు రావు.

దగ్గు, జలుబు, గొంతు ఇన్ ఫెక్షన్లకు :
తేనెలో సహజ సిద్దమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువలన వైరస్, బాక్టీరియాలపై సమర్ధవంతగా పోరాటం చేస్తుంది. ఈ చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని దూరం చేస్తుంది.

జీర్ణాశయ సమస్యలకు :
ఈ శీతాకాలంలో మనలో జీర్ణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఎలాంటి పదార్ధం తిన్న తొందరగా ఆరగదు. కానీ తేనె, ఉసిరి మిశ్రమం తీసుకోవడం వలన ఆహారం జీర్ణం అవడమే కాకుండా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఆకలి లేని వారు కూడా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

(Visited 3,483 times, 1 visits today)