Home / Inspiring Stories / ఆధార్ కార్డు పై తప్పులు ఉన్నాయా..? ఇప్పుడు మీరే మార్పులు చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు పై తప్పులు ఉన్నాయా..? ఇప్పుడు మీరే మార్పులు చేసుకోవచ్చు.

Author:

ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా అవసరం, ప్రభుత్వ ఉద్యోగాలకైన, పథకాలకైనా, వివిధ రకాల గుర్తింపు కార్డుల కోసం, బ్యాంకు అకౌంట్స్, లోన్ కావాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఆధార్ కార్డు వల్ల ఒకరికి ఒకటే పర్మినెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, అన్ని అవసరాలకి ఆధార్ కార్డు ఉపయోగ పడుతుంది, ఎంతో ముఖ్యమైన ఆధార్ కార్డుపై తప్పులు ఉంటే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది, ఆధార్ కార్డు డిటైల్స్ లో తప్పులు ఉంటే ప్రభుత్వ పథకాలని సరిగ్గా పొందలేము.

ఆధార్ కార్డు పైన ఉన్న తప్పులని సరిదిద్దెందుకు మనం ఆధార్ కేంద్రాల చుట్టూ, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మనమే సొంతంగా డిటైల్స్ ని ఇంటర్నెట్ ద్వారా మార్చుకోవచ్చు.

ఆధార్ కార్డు పై డిటైల్స్ మార్చుకోవడం:

ఆధార్ కార్డు పై డిటైల్స్ మార్చుకోవడం:

  • https://ssup.uidai.gov.in/ssup-home అనే వెబ్ సైట్ ని ఓపెన్ చెయ్యాలి.
  • ఆ తరువాత Correction Request Online పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు ఆధార్ కార్డు నంబర్ ని ఎంటర్ చేసి, దాని కింద కనిపించే టెక్స్ట్ ని ఎంటర్ చేసి, Send OTP ని క్లిక్ చేయాలి.
  • రిజిస్టర్ చేసిన మొబైల్ కి OTP వస్తుంది, ఎంటర్ చేయాలి.
  • ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, వాటిలో మార్చాలనుకున్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి,
  • ఆ తరువాత డిటైల్స్ ని మార్చి, దానికి సంబందించిన ప్రూఫ్ ని అప్ లోడ్ చేయాలి.

ఒకవేళ మీ కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ అయ్యీ ఉండక పోతే, లేదా మొబైల్ పోతే మీ దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీ వివరాలు మార్చుకోవచ్చు. మీ దగ్గర లోని ఆధార్ కేంద్రం ఎక్కడ ఉందో ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోండి.

Must Read:  10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ పోయిందా…? ఇప్పుడు చాలా సులభంగా తిరిగి పొందవచ్చు.

ఇంకా వివరంగా తెలుసుకోవడానికి కింది వీడియో చూడండి.

(Visited 60,368 times, 1 visits today)