Home / Latest Alajadi / చనిపోయిన వారిని తిరిగి బ్రతికించ వచ్చా?

చనిపోయిన వారిని తిరిగి బ్రతికించ వచ్చా?

Author:

చ‌నిపోయిన వారిని మ‌ళ్లీ బ్ర‌తికించొచ్చా అంటే కొంత‌వరకూ ప్రయత్నం చేస్తాం అంటు న్నారు స్వీడిష్ శాస్త్రవేత్తలు.ఇప్పుడు ప్రపంచం అంతా కృతిృమ మేథ (ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ )AI చుట్టూ తిరుగుతోంది. ఆ మధ్య శాస్త్ర వేత్తలు ‘సోఫియా అనే AI గల రోబోట్ తో మానవుల ఇంటరాక్షన్ కూడా నిర్వహించారు. అయితే తాజాగా మరో సంచలనానికి స్వీడన్ శాస్త్రవేత్తలు తెరలేపారు.

చనిపోయిన మనుషులను రోబోటిక్ క్లోన్ల రూపంలో తిరిగి పుట్టించేందుకు ఈ AI సాంకేతికతను వాడుకోబోతున్నారు. దీని ద్వారా చనిపోయిన వ్యక్తి గొంతును తిరిగి సృష్టించవచ్చట. ఈ ప్రయోగాలను స్వీడిష్ అంత్యక్రియల నిర్వహణా సంస్ధ ఫోనిక్స్ ఆధ్వర్యంలో జరగనుంది.

ఎలా సాధ్యమవుతుంది?

ఇందుకోసం మృత దేహాలను ఖననం చేయకుండా దాచిపెట్టే ఇండోనేషియా కు చెందిన ‘టోరోజెన్ ” తెగ సహాయం తీసుకొంటున్నారు. వారు తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంచి ప్రతిరోజు దానిని శుభ్రపరచటమే కాక ఆహారం కూడా అందిస్తారు. మృతదేహాలు పాడవకుండా ‘ఫార్మాలిన్ ‘ ద్రావణాన్ని ఎక్కిస్తారు. ఈ మృతదేహాల సహాయంతో ప్రయోగాలు చేయాలని ఫోనిక్స్ సంస్ధ భావిస్తోంది. అంతే కాదు ఎవరైనా మృతదేహాలను స్వ‌చ్ఛందంగా ఇస్తే వాటితో పరిశోధనలు జరుపుతామంటోంది.

d1

ఇప్పటి వరకు తెలిసిన వివ రాల ప్రకారం ఈ రోబోటిక్ క్లోన్స్ చనిపోయిన వ్యక్తుల రూపు రేఖలు పోలిఉంటాయి.వారి గొంతును కలిగి ఉంటాయి. ఇంకా వారి రోజు వారీ జీవనశైలి కి సంబంధించిన చిన్నచిన్న ప్రశ్నలకు జవాబులు కూడా చెప్ప గలుగుతాయట. మరణించిన వారి ఙ్ఞాపకాలను మళ్ళీ కళ్ళ ముందు నిలిపే ఈ ప్రయత్నం వాస్తవ రూపం దాల్చాలని ఆశిద్దాం.

d2

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)