Home / Inspiring Stories / బర్త్,డెత్ సర్టిఫికెట్ కోసం ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఒక్క క్లిక్ తో పొందవచ్చు.

బర్త్,డెత్ సర్టిఫికెట్ కోసం ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఒక్క క్లిక్ తో పొందవచ్చు.

Author:

మనదేశంలో లక్ష రూపాయలు అయినా సరే ఒక్క రోజులో సంపాదించవచ్చు కానీ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్ళి ఒక్కరోజులో బర్త్ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ తెచ్చుకోలేము, ఈరోజు అప్లై చేస్తే ఒక నెల రోజుల పాటు కాళ్ళు అరిగేలా ఆ ఆఫీస్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగితేనే సర్టిఫికెట్ మన చేతిలోకి వస్తుంది, ఇంకొన్ని సార్లు సర్టిఫికెట్ కోసం వేల రూపాయలని లంచం రూపంలో కూడా ఇవ్వాల్సి వస్తుంది, కానీ అలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్ట‌మ్ (సీఆర్ఎస్) అనే ఆన్ లైన్ వ్యవస్థని తీసుకువచ్చింది, దీని ద్వారా మనం ఇంట్లో ఉండే ఇంటర్నెట్ ద్వారానే బర్త్, డెత్ సర్టిఫికెట్లని ఆన్ లైన్ లో అప్లై చేసి ఏ ఆఫీసుకు వెళ్ళకుండానే పొందవచ్చు. గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఈ ఆన్ లైన్ వ్యవస్థ ఏలా పనిచేస్తుందో క్రింద చదవండి.

birth and death registration_01

1. మీ కుటుంబంలో ఎవరైనా జన్మించినా లేదా మరణించినా వారి వివరాలతో సర్టిఫికెట్ నమోదు చేయాలనుకుంటే ముందుగా http://crsorgi.gov.in/web/index.php/auth/signUp లింక్ మీదా క్లిక్ చేసి మీ పేరు, ఊరు, ఈమెయిల్ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
2. తరువాత మీ ఈమెయిల్ కి ఒక లింక్ వస్తుంది, దానిని ఒపెన్ చేసి మీ అకౌంట్ కి కొత్త పాస్ వర్డ్ పెట్టుకుని లాగిన్ అవ్వాలి.
3. తరువాత పుట్టినవారి లేదా చనిపోయిన వారి వివరాలు నమోదు చేసి ఆ వెబ్ సైట్ లో చెప్పిన విధంగా సర్టిఫికెట్ అప్లై చేయాలి.
4. అప్లై చేసిన 15 రోజుల్లోగా మీ స‌ర్టిఫికెట్ రెడీ అవుతుంది, దానిని మీరు ఇదే వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే పుట్టిన తేది లేదా మరణించిన తేది నుండి 21 రోజులలోగా ఈ వెబ్ సైట్ లో స‌ర్టిఫికెట్ కోసం అప్లై చేయాలి.

(Visited 38,931 times, 1 visits today)