Home / General / మొండి పిల్లల్ని మార్చేందుకు మార్గాలు..!

మొండి పిల్లల్ని మార్చేందుకు మార్గాలు..!

Author:

గంపెడు సంతానం పాత మాట. ఒకబిడ్డే నేటి వాస్తవం. తల్లి తండ్రుల అతి గారాబం వ‌ల‌న వారు మొండి పిల్లలుగా తయారవుతున్నారు.
అనుకున్నది సాధించడానికి ,కావాల్సింది కొనిపించుకోడానికి తమ మొండి తనాన్ని ఆయుధంగా వాడుతుంటారు.

ఇంట్లోనే కాదు నలుగురిలోనూ ఈ పరిస్థితి తల్లితండ్రులను చికాకు పరుస్తుంది.
మరి పిల్లల మొండితనం మానిపించే మార్గాలేమిటో చూద్దామా!

1. దృష్టి మరల్చండి
పిల్లలు ఏదైనా విషయం పై మొండిగా ఉంటే వారి దృష్టి వేరేదానిపై మళ్ళించండి.వారు ఎక్కువ సేపు ఒకే విషయంపై దృష్టి పెట్ట లేరు కనుక ఇది ఫలించవచ్చు.

2. ఆప్యాయతను ప్రదర్శించండి
పిల్లలు మారాం చేస్తున్నపుడు వారిని దగ్గరకు తీసుకోవడం, వారితో ప్రేమగా మాట్లాడడం ద్వారా వారంటే మీకు చాలా ఇష్టం అని అర్ధం చేసుకోనివ్వండి.వారిని కౌగలించుకొని చేరదీయడం వల్ల వారు మీకు చాలా ముఖ్యం అని భావించి భ‌ద్రతాభావం కలిగి, మారాం మానేస్తారు.

child2

3. హాయిగా నవ్వించండి
పిల్లల్ని ఏదో ఒకటి చేసి నవ్విస్తే మారాం మరచి సంతోషంగా ఉంటారు.

4. ప్రేమగా నచ్చ చెప్పండి
పిల్లలు బెట్టు చేస్తున్న‌ప్పుడు ఓపిక‌గా,ప్రేమగా వారికి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయండి.తిట్టడం వల్ల లాభం లేదు.ప్రేమగా చెప్తే పిల్లలు అర్థం చేసుకోగలరు.

5. భద్రతా భావం కలిగించాలి
చాలా సార్లు భయం,అభధ్రతా భావం వల్ల మారం చేస్తారు. కాబట్టి వారితో సన్నిహితంగా మెలిగి వారిలో భయాల్ని తొలగించండి.

6. పట్టించుకోకుండా ఉండడం
మరీ చిన్న విషయాలకే మొండి చేస్తుంటే దానిని అసలు పట్టించుకోకుండా ఉండండి. ఇలాంటి విషయాల్లో ఏడ్చీ ఏమీ సాధించలేమని వారికే అర్థం అవుతుంది.

7. ఒప్పుకోవద్దు
పిల్లల ఏడుపు ఆపటానికీ మొహమాటానికి ఏదీ ఒప్పకోవద్దు. ఈ ఒక్కసారికే అని ఎప్పుడూ అనవద్దు. నిర్మొహమాటంగా వ్యవహరించండి.

8. శిక్ష—బహుమతి
పిల్లలు మరీ అల్లరి చేసినపుడు వారిని సున్నితంగా శిక్షించాలి.చాలా చాలా చిన్న శిక్షలు విధించాలి.
అలాగే వారు ఏ చిన్న మంచి పని చేసినా ముద్దు చేసి బహు మతులిచ్చి ప్రోత్సహించాలి.

9. చర్చే ఫలి
మంకు పట్టిన అంశం పై మంచీ చెడూ వివరిస్తూ వారి కోరిక ఎందు కు తీర్చలేమో తెలియ జేయాలి.

10. సమయం కేటాయించండి
పిల్లలకు విసుగు, కోపం ప్రదర్శించే ఏకైక మార్గం మంకు పట్టు.కాబట్టి వీలైనంతగా వారిని తోటి పిల్లల్తో కలుపుతూ వారితోఎక్కువ సమయం గడపాలి. అంతే కానీ ఎట్టి పరిస్థితుల్లో వారితో అసహనంగా మాట్లాడకూడదు. కఠినంగా వ్యవహరించరాదు.

(Visited 2 times, 1 visits today)