Home / General / ATM పిన్ నెంబర్ మర్చిపోయారా?

ATM పిన్ నెంబర్ మర్చిపోయారా?

Author:

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి సొంత బ్యాంకు అకౌంట్ ఉంటుంది. దీనివలన ATM కార్డ్ వాడుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్ కాని, డెబిట్ కార్డ్ పిన్ నెంబర్ ని అన్ని వేళలా గుర్తుంచుకోవ‌డం కొద్దిగా కష్టం. మరి అది మ‌రిచిపోయిన‌ట్ల‌యితే తిరిగి పొందడం చాలా కష్టం. బ్యాంకు వారిని సంప్రదించి మన సమాచారాన్ని తెలియచేస్తే కానీ తిరిగి మన ATM పిన్ నెంబర్ పొందలేము.

111

కానీ, ఇప్పుడు ATM పిన్ ని తిరిగిపొందడం చాలాసులభం, ఎలా అంటే ATM సెంటర్ లోనే పిన్ నెంబర్ ని మార్చుకోవచు. దానికి ముఖ్యంగా ATM కార్డ్, బ్యాంకు అకౌంట్ నెంబర్, మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ కి లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ తప్పనిసరి. తరువాత మీ బ్యాంకు ATM మెషీన్ లో కార్డు ను ఉంచి ఈక్రింది విధంగా చేయండి.

  • బ్యాంకింగ్ అనే ఆప్షన్ ని సెలక్ట్ చేయండి .

 

  • పిన్ జెనరేట్ లేదా ATM పిన్ రీసెట్ ఆప్షన్ ని సెలక్ట్ చేయండి.

 

  • ఇప్పుడు మీ అకౌంట్ నెంబర్ టైపు చేయండి

 

  • ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ టైపు చెయ్యండి. మీ మొబైల్ నెంబర్ కి ఒక పాస్ వర్డ్ వస్తుంది. దానిని ATM మెషీన్ లో టైపు చెయ్యండి

 

  • ఇప్పుడు కొత్త పిన్ నెంబర్ ని ఎంటర్ చెయ్యండి.

 

పై విధంగా చేసినట్లయితే మీ పాత పిన్ నెంబర్ పోయి కొత్త పిన్ నెంబర్ కి మార్చుకోవచ్చు.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)