Home / health / ఈ రెండు నియమాలు పాటించి ఇరిటేషన్ బాధ నుండి బయటపడండి.

ఈ రెండు నియమాలు పాటించి ఇరిటేషన్ బాధ నుండి బయటపడండి.

Author:

ఈరోజుల్లో మైండ్ ఎంత కూల్ గా ఉంటే పనిని అంత సులువుగా, తొందరగా పూర్తీ చెయ్యవచ్చు. ఇది అందరికి తెలిసిన విషయమే….ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయిన తన మైండ్ ని తన కంట్రోల్లో పెట్టుకుంటేనే గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడు. ఇప్పుడున్న గొప్ప వ్యక్తులంతా చేసే పని తమ మైండ్ ని తమ కంట్రోల్లో పెట్టుకోవడమే. ఉదయం లేవగానే పీస్ ఫుల్ మైండ్ తో నిద్ర లెస్తే ఆ రోజు మొత్తం చాలా పీస్ ఫుల్ గా గడిచిపోతుంది. మన మైండ్ ఎప్పుడైతే విసుగు (ఇరిటేషన్) చెందుతుందో అప్పుడు మనకు తెలియకుండానే మనలో మార్పు వస్తుంది. ఆ మార్పు మన పై చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ ఇరిటేషన్ అనేది ఇతరుల వలన కలుగవచ్చు, అనారోగ్యం వలన లేద ఇంకా చాల కారణాల వలన కల్గవచ్చు. ఉద్యోగరిత్యా ఆఫీసులలో కానీ, కాలేజిలో ఎవరైనా ఇబ్బంది పెట్టేస్తుంటారు. ఇంట్లో, బయట మానవ సంబంధాలు సరిగ్గాలేకుంటే కూడా ఇరిటేషన్ వస్తుంది. మన మనసు భాగాలేనప్పుడు ఇతరులు ఏది మాట్లాడిన మనకు ఇరిటేషన్ లాగానే అనిపిస్తుంది. మనం చేయవలసిన పని అనుకున్న సమయానికి చేయలేకపోయినా సమయంలో కచ్చితంగా ఇరిటేషన్ కలుగుతుంది. ఇందులో మనకు ఇతరుల వలన కలిగే ఇరిటేషన్ ఎక్కువ.

how to get rid of irritation

మరి ఈ ఇరిటేషన్ నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా :

ఇరిటేషన్ కలగకుండా ఉండాలన్టే ముందుగా మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా పీస్ ఫుల్ గా ఉండాలి. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాతావరణం పీస్ ఫుల్ గా ఉంటుందో మన మైండ్ కూడా ఉత్సాహాముగ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడైతే డిస్టర్బెన్స్ గా ఉంటుందో మన మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి సమయంలో మనం రెండు విధాలుగా ఇరిటేషన్ ను తగ్గించుకోవచ్చు.

1) ఇతరులు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మనం వారి నుండి దూరముగా వెళ్ళాలి.
2) మనని మనం నియంత్రించుకోవడం అలవరచుకోవాలి, కోపం లో వున్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నిగ్రహాన్ని పాటించాలి.

ఈ రెండు నియమాలు పాటిస్తే ఇరిటేషన్ బాధ నుండి బయటపడొచ్చు.

(Visited 1,539 times, 1 visits today)