Home / Entertainment / యంగ్ టైగర్ పై హృతిక్ రోషన్ ప్రశంశలు

యంగ్ టైగర్ పై హృతిక్ రోషన్ ప్రశంశలు

Author:

Hrithik on Jr NTR

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. దీనికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. ఇదలా ఉంచితే.. రీసెంట్ గా పలువురు సెలబ్రిటీస్ ఎన్.టి.ఆర్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు. తాజాగా అలనాటి కుష్బు ఎన్.టి.ఆర్ పై ప్రశంశలు కురిపించడమే కాకుండా నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ కోసం చూస్తున్నానని చెప్పింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఎన్.టి.ఆర్ ప్రశంశల జల్లు కురిపించిన వారిలో జాయిన్ అయ్యాడు. రీసెంట్ గా  జరిగిన ఓ మీడియా ఈవెంట్ లో ఎలక్ట్రిఫై డాన్సులు వేయడంలో బెస్ట్ అని, సూపర్బ్ పెర్ఫార్మర్ అని ఎన్.టి.ఆర్ పై ప్రశంశలు కురిపించాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కూడా తనని ప్రశంశలతో ముంచెత్తడం చెప్పుకోదగిన విషయం.

ఎన్.టి.ఆర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా నాన్నకు ప్రేమతో’. మొత్తంగా ఈ సినిమా కోసం 45కోట్లకి పైనే ఖర్చు పెట్టారు. అదీకాక ఈ సినిమాని 90% అబ్రాడ్ లోనే షూట్ షూట్ చేసారు. సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్ర నిర్మాత భారీ ఎత్తున ఖర్చు చేసి ఈ సినిమాని నిర్మించాడు. అలాగే ఎన్.టి.ఆర్ కెరీర్లో అన్ని రకాలుగా ఈ సినిమా బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుందని బివిఎస్ఎన్ ప్రసాద్ తెలిపాడు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 13న రిలీజ్ కానుంది.

(Visited 99 times, 1 visits today)