Home / Inspiring Stories / జులై 17 నుంచి హైదరాబాద్ లో బోనాలు

జులై 17 నుంచి హైదరాబాద్ లో బోనాలు

Author:

తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక గా నిలిచే “బోనాలు” పండుగను ఈసారి అంగరంగ వైభవంగా జరుపనున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిపే బోనాల పండుగ ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుపాలని ఉన్నతాధికారులతో సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జులై 17 నుంచి హైదరాబాద్ బోనాలు ప్రారంభంకానున్నాయి.

Hyderbad bonalu 2016 dates

ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా  ముందుగా గోల్కోండలో ప్రారంభం అవుతాయి. తర్వాత జులై 24, 25 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రులు. ఈ బోనాల పండుగలో పోతురాజుల ఆటలు, శివసత్తుల పాటలు అన్ని కలసి భాగ్యనగరానికి ఒక కొత్త శోభ తీసుకువస్తాయి. ఈ బోనాల పండక్కి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు చెప్పారు. గతం కంటే ఈ ఏడాది బోనాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

(Visited 443 times, 1 visits today)