Home / Inspiring Stories / ఇక డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

ఇక డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

Author:

Two-Wheeler-Document-1

లైసెన్స్ అవసరం లేదు అంటే తీస్కువెళ్ళే అవసరం లేదని అంతే…. మీరు వాహనాలపై బయటకు వెళ్లే తొందర్లో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా! రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదరవుతున్నాయా.. ఇక నుంచి నిశ్చింతగా ఉండండి. మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. మీ వాహన, లైసెన్స్ చరిత్రలన్నీ అందులోనే లభిస్తాయి. ఈ మేరకు త్వరలోనే వాహనదారులకు సేవలను మరింత సులభతరం చేయడానికి రవాణాశాఖ కొత్త టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుంటుంది.

దీంతో ఈ సమస్యకు చెక్ పెడుతూ, వాహనదారుల సౌలభ్యం కోసం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. మీకు సెల్‌ఫోన్ ఉంటే చాలు, అన్ని ధ్రువ పత్రాలు భద్రపరిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికను అందిపుచ్చుకుంటూ.. డిజిటల్ పత్రాలను సిద్ధం చేసి, ఆర్టీఏ ఎం వ్యాలెట్ పేరుతో రవాణా సేవలను విస్తరించింది.

‘ఎం(మొబైల్‌) వ్యాలెట్‌’ పేరుతో రానున్న ఈ సౌకర్యంలో మొబైల్‌ అప్లికేషన్ ద్వారా వాహనదారులు… తమ వాహనాల డ్రైవింగ్‌ లైసెన్సులతో పాటు బీమా పత్రాలన్నింటినీ కూడా ‘డిజిటలైజ్‌’ చేసుకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా… ‘ఎం వ్యాలెట్‌’ పేరుతో మొబైల్‌ అప్లికేషన్ ను డౌన్ లోడ్‌ చేసుకోవటమే. అయితే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టంలతో ఉన్న స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఈ యాప్‌ పని చేస్తుందట. ఒకసారి ఈ ‘ఎం వాలెట్‌’ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకున్న తర్వాత… తమ వాహనాలకు సంబంధించిన వివరాలన్నిటినీ ‘అప్‌లోడ్‌’ చేస్తే చాలు. ఆ వివరాలన్నీ కూడా ఈ యాప్‌ ద్వారా రవాణాశాఖ సెంట్రల్‌ సర్వర్‌కు చేరతాయి. అవి డిజిటలైజ్‌ అయినట్లుగా మనకో నంబర్‌ కూడా వస్తుంది..ఇందులో వాహన ఇన్సూరెన్స్ చెల్లించింది లేనిది స్పష్టంగా వివరాలు ఉంటాయి. రోడ్డెక్కిన వాహనం ఇన్సూరెన్స్ చెల్లించకుండా తప్పుడు సర్టిఫికెట్లు, లేక తేదీలను మార్చి అధికారులను తప్పుదారి పట్టించే అవకాశం లేకుండా వాహన్‌బీమా ద్వారా పసిగట్టే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించిన వాటిలో 15 సేవలపై ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించిన రవాణా శాఖ ఎం-వాలెట్ విధానం కూడా ప్రవేశపెట్టి టెక్నాలజీని వీలైనంతగా వాడుకుటూ సేవలను సులభతరం చేస్తోంది..

ట్రాఫిక్ పోలీసులు ఆపగానే పర్సులోంచి, వాహనం లోంచి పత్రాల కోసం వెతకాల్సిన అవసరం లేదిక.. రవాణా శాఖ అందుబాటులోకి తేనున్న ఎం-వాలెట్ యాప్‌తో స్మార్ట్‌ఫోన్‌లో అన్ని పత్రాలు భద్రపరచుకోవచ్చు.. ఆర్టీఏ ఎం వ్యాలెట్ యూప్‌ను మొబైల్‌లోని ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు రవాణా శాఖ అధికారులు వెసులుబాటు కల్పించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. యూప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఆయా ధ్రువపత్రాలపై ఉన్నపేరు, సెల్‌ఫోన్‌లో నమోదు చేసిన వెంటనే వన్‌టైం పాస్‌వర్డ్(ఓపీటీ) వస్తుంది.దాన్ని నమోదు చేసిన వెంటనే ఆ పత్రం యొక్క జిరాక్స్ మొబైల్‌లో కన్పిస్తుంది. ఒక వ్యక్తికి సంబంధించిన ఎన్ని పత్రాలైనా ఈ యూప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరుచుకునేందుకు వీలుంది. ఈ విధానంతో నకలీ పత్రాలకు కూడా కాలం చెల్లుతుంది.ఇకనేం ఇక హాయి హాయిగా ఏదీ మర్చిపోయాం అనే బెంగ లేకుండా రోడ్డెక్కొచ్చన్న మాట…

Must Read: మగవారు మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా..?

(Visited 24,115 times, 1 visits today)