Home / Inspiring Stories / పాము విషంతో ఎయిడ్స్ కి చెక్ పెట్టిన హైదరాబాద్ డాక్టర్స్.

పాము విషంతో ఎయిడ్స్ కి చెక్ పెట్టిన హైదరాబాద్ డాక్టర్స్.

Author:

ఎయిడ్స్…ప్రాణాంతకమైన ఈ జబ్బుకి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం.ఎయిడ్స్ సోకిన వాళ్ళంతా ఎవరికీ చెప్పుకోలేక చికిత్స లేక నరకం అనుభవిస్తున్నారు. వీరింక కంగారుపడాల్సిన పనిలేదు.ఎందుకంటే హైదరాబాద్ రామంతాపూర్ గవర్నమెంట్ హొమియో వైద్యుల పుణ్యం వల్ల ఎయిడ్స్ కి చెక్ పెట్టె అవకాశం దొరికింది. ఎబోలా వైరస్ కి పని చేసే మందుని పరిశోధనల్లో భాగంగా పరిశీలిస్తే ఎయిడ్స్ కి పనికొస్తుందేమో అన్న ఆలోచన వచ్చింది మన హోమియో డాక్టర్స్ కి. దానితో రీసెర్చ్ చేసి విజయవంతమయ్యారు. ఇప్పటికే దాదాపు 13 వేల మంది ఎయిడ్స్ పేషంట్స్ రామంతాపూర్ హోమియో ఆసుపత్రికి వచ్చారట.

బ్రెజిల్ కి చెందిన ఒక విషసర్పం నుంచి తీసిన విషం ద్వారా ఈ మందు కనుగొన్నారట. ఇప్పటికే ఈ మందు వాడుతున్న ఎయిడ్స్ పేషంట్స్ లో చాలా మందికి జబ్బు తగ్గుముకం పట్టిందని డాక్టర్స్ చెబుతున్నారు.ఎబోలాకి, ఎయిడ్స్ వైరస్ కు కొన్ని దగ్గరి పోలికలు ఉండడంతో దీన్ని ఎయిడ్స్ కి ఎందుకు వాడరాదు అనే ఆలోచన వచ్చిందంటున్నారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ .ఈయనే ఈ మందుని కనుగొన్నది. ఐతే పర్ఫెక్ట్ రిపోర్టులతో వస్తే ఈ వ్యాదిని ఇంకాస్త మెరుగ్గా తగ్గించవచ్చనేది డాక్టర్ల సలహా. దాదాపు ఈ మందులు వాడుతున్నందరిలోను మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయని తెలిపారు . కానీ  ఎయిడ్స్ సోకిన వాళ్ళలో చాలామంది పేదవాళ్ళే కావడంతో చికిత్స కోసం ఖర్చు పెట్టె స్తోమత కూడా చాలామందికి లేదు. హైదరాబాద్ రామంతాపూర్ లోని హోమియో ఆసుపత్రి లో ప్రతి సోమ, గురు వారాల్లో ఈ మందు పంపిణి జరుగుతుంది..కాబట్టి ఎయిడ్స్ సోకిందని కుంగిపోకుండా ధైర్యంగా రామంతాపూర్ వెళ్ళండి.. సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగిరండి.

(Visited 1,698 times, 1 visits today)