Home / Inspiring Stories / దేశంలోనే నంబర్ వన్ సిటీ గా హైదరబాద్.

దేశంలోనే నంబర్ వన్ సిటీ గా హైదరబాద్.

Author:

Best City in India to Live

సిటీ ఆఫ్ పెరల్స్ ఇప్పుడు డైమండ్ సిటీ అనిపించుకుంటోంది. భారతదేశం లోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న నగరం గా హైదరాబాద్ మరో కీర్తి గడించింది. మన దేశంలో మెరుగ్గా జీవించేందుకు అత్యుత్తమమైన నగరం అంటూ ఏటా ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ సర్వే నిర్వహించే మెర్సర్స్ సంస్థ 2015 వ సంవత్సరానికి గానూ రిపోర్టు ను ప్రకటించింది. మెరుగైన జీవనం విషయంలో భారతదేశంలోనే హైదరాబాద్‌ ది బెస్ట్ సిటీ గా ఈ రిపోర్ట్ పేర్కొంది. ప్రపంచస్థాయి వసతులు,జీవన ప్రమాణాల ఆధారంగా చేసే ఈ సర్వేలో మన దేశంలో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 138 వస్థానం దక్కించుకుంది. భారత దేశంలో ఇదే మొదటిస్థానం.

హైదరాబాద్ తర్వాత పునే(145) భారత దేశ ఐటీహబ్ భెంగలూరు (146), ఛెన్నై (151), ఆర్థిక రాజధాని ముంబై (152) దేశ రాజకీయ రాజధాని న్యూఢిల్లి (154) జీవణ ప్రమాణాల విషయం లో హైదరాబాద్ కన్నా వెకనబడ్డాయి. పక్క దేశాలైన శ్రీలంకలోని కొలంబో హైదరాబాద్ కన్నా ముందు నిలబడి 132వ స్థానాన్ని ఆక్రమించగా , బంగ్లాదేశ్‌లోని ఢాకా 211వ స్థానాన్ని, పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ 202వ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆసియాలో 26వ ర్యాంకుతో సింగపూర్ మొదటిస్థానంలో నిలిచింది.

నగరంలో ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంగ్లీష్ బోధించే అత్యుత్తమమైన పాఠశాలలనూ తక్కువ కాలుష్యంమూ,తక్కువ ఖర్చు తో బతికే పరిస్థితులూ ఇంకా నగరానికి 22 కిలోమీటర్ల దూరం లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా హైదరాబాద్ ని మొదటి స్థానం లో నిలబెట్టాయి. కొన్ని సంవత్సరాలుగా డిల్లి ముంబై వంటి నగరాల్లో జనాబా పెరుగుదల మందగించటం,విపరీతమైన కాలుష్యం వంటి కారణాలు ఆ నగరాలను వెనక్కు నెట్టాయని (గ్లొబల్ మొబిలిటీ) మెర్సెస్ భారతీయ ప్రతినిధి చెప్పారు..కాలుష్యం విషయం లోనూ,తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ లోనూ హైదరాబాద్ మిగిలిన భారతీయ నగరాల కంటే మెరుగ్గా ఉండటానికి కారణాలనేకం ఇక్కడి వాతావరణం మిగిలిన నగరాల కంటే చాలా భిన్నంగా కూడా ఉంది అని వ్యాఖ్యానించారు.

(Visited 856 times, 1 visits today)