Home / Latest Alajadi / హైదరాబాద్ హోటల్ లో ఎమ్మార్పీ కంటే రూ.4 ఎక్కువకి అమ్మినందుకు రూ.10,000 ఫైన్..!

హైదరాబాద్ హోటల్ లో ఎమ్మార్పీ కంటే రూ.4 ఎక్కువకి అమ్మినందుకు రూ.10,000 ఫైన్..!

Author:

సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో వాట‌ర్ బాటిల్స్‌, కూల్ డ్రింక్స్, తిను బండారాలు… ఇలా ఇవే కాదు, ఏ వ‌స్తువునైనా, ప్యాక్డ్ ఫుడ్‌నైనా ఎంఆర్‌పీ క‌న్నా ఎక్కువ రేటుకి అమ్ముతుంటారు, ఇదేంటి ఎమ్మార్పీ కంటే ఎక్కువ..? అని ప్రశ్నిస్తే కొంటే కొనండి లేకపోతే లేదు అని అంటారు, ఈ మధ్యనే కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గారు ఎవరైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువకి అమ్మితే చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు,  అయిన కూడా వ్యాపారుల దోపిడీ ఆగలేదు, మన హైదరాబాద్ లోనే ఒక రెస్టారెంట్ లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకి అమ్మినందుకు అధికారులు ఆ హోటల్ నిర్వాహకులపై ఫైన్ విధించారు.

Shah-Gouse-Fine

విజయ్ గోయల్ అనే సామాజికవేత్త హైదరాబాద్ నగరంలో ప్రముఖ హోటల్ అయిన షా గౌస్ హోటల్ కి వెళ్లారు, అయన నుండి హోటల్ నిర్వాహకులు ఒక కూల్ డ్రింక్ కి ఎమ్మార్పీ కంటే 4 రూపాయలని ఎక్కువ వసూలు చేసారు, ఇదేంటి అని ప్రశ్నిస్తే, ఇక్కడ (ఆ హోటల్ లో) ఇలాగే ఉంటుందని సమాధానం ఇచ్చి గొడవ పెట్టుకున్నారు, ఆ హోటల్ నిర్వాకం పై విజయ్ గోయల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లీగ‌ర్ మెట‌రాల‌జీ డిపార్ట్‌మెంట్‌కు ఆయ‌న ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆ రెస్టారెంట్‌పై రూ.10వేల ఫైన్ వేశారు. ఆ మొత్తాన్ని నష్టపరిహారం కింద విజయ్ గోయల్ కి అందిస్తారు, ఎవరైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువకి విక్రయిస్తుంటే సంభందిత అధికారులకి ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ వ్యాపారుల పై చర్యలు తీసుకునేలా అధికారులు పనిచేస్తున్నారు, మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే సంబంధిత బిల్ తీసుకోని అధికారులకి ఫిర్యాదు చేయండి.

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఫిర్యాదుల కోసం ఒక వెబ్ సైట్ , టోల్ ఫ్రీ నెంబర్ ని మొదలు పెట్టారు, సరైన సాక్ష్యాధారాలతో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు.

Consumer help lines:

 

  • Call Toll-free: 1800-11-4000 or 14404
  • Send SMS: 8130009809
(Visited 1,479 times, 1 visits today)